High Court Stay on Srisailam Trust Board swearing: శ్రీశైలం దేవాలయం ట్రస్ట్ బోర్డ్ సభ్యుల ప్రమాణ స్వీకారంపై ఏపీ హైకోర్టు స్టే ఇచ్చింది. 15 మంది ట్రస్ట్ బోర్డ్ సభ్యులను నియమిస్తూ జీవో 84ను ఈ నెల 3న ప్రభుత్వం జారీ చేసింది. శ్రీశైలం ట్రస్ట్ బోర్డు నియామకం సవాల్ చేస్తూ కొర్రా శ్రీనివాసులు నాయక్.. హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. సభ్యుల నియామకాలు.. నిబంధనలకు విరుద్ధంగా ఉన్నాయని పిటిషనర్ తరపు న్యాయవాది వేణుగోపాల్ రావు వాదనలు వినిపించారు.
గిరిజనులు లేరు
ట్రైబల్ చరిత్ర కలిగిన దేవాలయంలో.. గిరిజనులకు ప్రాతినిథ్యం లేకపోవడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. నిబంధనల ప్రకారం ఇద్దరు హిందూ ధార్మిక తాత్వికవేత్తలు ఉండాలని.. కానీ ప్రస్తుత ట్రస్ట్ బోర్డులో అలా లేరని ధర్మాసనం దృష్టికి తీసుకువచ్చారు.
తాత్కాలికంగా నిలిపివేత
పిటిషనర్ వాదనలతో ఏకీభవించిన ఉన్నత న్యాయస్థానం.. ఈ నెల 14న జరగనున్న శ్రీశైలం ట్రస్ట్ బోర్డు సభ్యుల ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని తాత్కాలికంగా నిలిపివేస్తూ మధ్యంతర ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణ వచ్చే బుధవారానికి వాయిదా వేసింది.
ఇదీ చదవండి: ఇతర రాష్ట్రాలకూ హిజాబ్ వివాదం.. హైకోర్టు కీలక ఆదేశాలు