ధరణిలో వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్, మ్యూటేషన్లపై హైకోర్టు ఇచ్చిన స్టే రేపటి వరకు పొడిగించింది. ఆస్తుల నమోదు సవాల్ చేస్తూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యాలపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆర్ఎస్ చౌహాన్, జస్టిస్ బి. విజయ్ సేన్ రెడ్డి ధర్మాసనం ఇవాళ మరోసారి విచారణ చేపట్టింది.
ధరణిలో నమోదు చేసే వ్యక్తిగత వివరాలకు చట్టబద్ధమైన రక్షణ లేదని పిటిషనర్ల తరఫు న్యాయవాది వాదించారు. చట్టబద్ధత లేని అంశాలను అమలు చేయడం రాజ్యాంగ విరుద్ధమన్నారు. తదుపరి వాదనల కోసం విచారణను హైకోర్టు రేపటికి వాయిదా వేసింది.
ఇదీ చూడండి: మోదీది బేచో ఇండియా... తమది సోచో ఇండియా: కేటీఆర్