ETV Bharat / city

'వైద్యులపై దాడికి పాల్పడితే వెంటనే అరెస్టు చేయండి'

కరోనా బాధితులకు చికిత్స చేస్తున్న వైద్య సిబ్బందిపై దాడులకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకోవాలని హైకోర్టు స్పష్టం చేసింది. నిందితులను అక్కడికక్కడే అరెస్టు చేయాలని పేర్కొంది.

author img

By

Published : Apr 15, 2020, 8:26 PM IST

high court orders police to arrest the culprit who assault doctors
వైద్యులపై దాడికి పాల్పడితే వెంటనే అరెస్టు చేయండి

కరోనా వైరస్​ బారిన పడిన వారికి చికిత్స చేస్తున్న వైద్య సిబ్బందిపై దాడికి పాల్పడితే కఠిన చర్యలు తీసుకోవాలని హైకోర్టు స్పష్టం చేసింది. ఈ విషయంలో పోలీసులు ప్రేక్షక పాత్ర వహిస్తే.. వైద్య సిబ్బందిలో ఆత్మస్థైర్యం దెబ్బ తింటుందని, ఆ పరిస్థితులను రాష్ట్రం భరించలేదని వ్యాఖ్యానించింది.

కరోనా చికిత్సలు చేస్తున్న వైద్య సిబ్బందికి భద్రత పెంచాలని కోరుతూ కైలాష్ నాథ్ అనే వ్యక్తి రాసిన లేఖను సుమోటోగా స్వీకరించిన హైకోర్టు... వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణ చేపట్టింది. ఉస్మానియా ఆస్పత్రిలో వైద్య సిబ్బందిపై దాడి జరిగినట్లు పత్రికల్లో ప్రచురితమైన అంశాన్ని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆర్ఎస్ చౌహాన్, జస్టిస్ టి.అమర్ నాథ్ గౌడ్​లతో కూడిన ధర్మాసనం ప్రస్తావించింది. ఉస్మానియాలో వైద్యులపై దాడి ఘటనపై కేసు నమోదు చేసినట్లు అడ్వకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్ తెలిపారు.

దాడికి పాల్పడిన వారిని వెంటనే ఎందుకు అరెస్టు చేయలేదని ధర్మాసనం ప్రశ్నించింది. వైద్య సిబ్బందిపై దాడులకు తెగించిన వారిని ఎక్కడికక్కడ అరెస్టు చేసి విస్తృతంగా ప్రచారం చేయాలని సూచించింది. పోలీసులు ప్రేక్షక పాత్ర వహిస్తే వైద్యుల్లో ఆత్మస్థైర్యం దెబ్బ తింటుందని.. అలాంటి పరిస్థితి తలెత్తితే రాష్ట్రం భరించలేదని వ్యాఖ్యానించింది.

ప్రస్తుత విపత్కర పరిస్థితుల్లో శాంతిభద్రతలకు భంగం కలిగించే చర్యలను ఉపేక్షించవద్దని హైకోర్టు పేర్కొంది. వైద్యులపై జరిగిన దాడులు, నిందితులపై తీసుకున్న చర్యలు, వైద్య సిబ్బందికి కల్పించిన భద్రత వంటి పూర్తి వివరాలతో ఈనెల 20లోగా నివేదిక సమర్పించాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.