ETV Bharat / city

బాణసంచా నిషేధించాలని ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం - ts ban crackers

బాణసంచా నిషేధించాలని ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం

author img

By

Published : Nov 12, 2020, 2:08 PM IST

Updated : Nov 12, 2020, 8:21 PM IST

14:06 November 12

బాణసంచా నిషేధించాలని ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం

దీపావళి వేళ తెలంగాణలో బాణసంచా అమ్మకాలు, కాల్చడంపై నిషేధం విధించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. న్యాయవాది ఇంద్రప్రకాశ్‌ వేసిన పిల్‌పై విచారణ చేపట్టిన ఉన్నత న్యాయస్థానం ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్రంలో నెలకొన్న కరోనా పరిస్థితుల్లో కాలుష్యం పెరిగి కరోనా బాధితులపై తీవ్ర ప్రభావం చూపుతుందని పిటిషనర్‌ తరఫు న్యాయవాది కోర్టుకు తెలియజేశారు. అంతేకాకుండా సుప్రీం కోర్టు, పలు రాష్ట్రాల హైకోర్టులు ఇప్పటికే నిషేధించాయనే విషయాన్ని గుర్తు చేస్తూ తెలంగాణలో కూడా చర్యలు తీసుకోవాలని న్యాయస్థానాన్ని కోరారు. నిషేధంపై ప్రభుత్వ వైఖరేంటని అడ్వొకేట్‌ జనరల్‌ను ప్రశ్నించగా.. దీనిపై ఒక నిర్దిష్ట పాలసీ రూపొందించలేదని.. ఎన్జీటీ మార్గదర్శకాలు పాటిస్తూ, అవసరమైన ఆంక్షలు విధిస్తామని వివరించారు.

కరోనా తీవ్రత ఉన్నట్టుగా ప్రభుత్వమే చెబుతుందని కాబట్టి ప్రస్తుత పరిస్థితుల్లో బాణసంచా కాల్చడం సరైంది కాదని విచారణ సందర్భంగా కోర్టు అభిప్రాయపడింది. ఈ నేపథ్యంలో బాణసంచా అమ్మకాలు, కాల్చడాన్ని నిషేధించాలని రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు స్పష్టం చేసింది. అయితే ఇప్పటికే అనేక ప్రాంతాల్లో బాణసంచా విక్రయాలకు ఏర్పాట్లు చేస్తున్నారని అడ్వొకేట్‌ జనరల్‌ కోర్టు దృష్టికి తీసుకెళ్లగా.. వాటన్నింటినీ నిరోధించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంటుందని హైకోర్టు స్పష్టం చేసింది. బాణసంచాపై ఎందుకు నిషేధం విధించాల్సి వచ్చిందనే అంశాలు, కారణాలతో ప్రజల్లో విస్తృత ప్రచారం చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. దీనిపై ఏం చర్యలు తీసుకున్నారనే విషయాన్ని నివేదిక రూపంలో ఈ నెల 19న అందించాలని అడ్వొకేట్‌ జనరల్‌ను ఉన్నత న్యాయస్థానం ఆదేశించింది.

మరోవైపు ఇప్పటికే పలురాష్ట్రాలు బాణసంచాపై నిషేధం విధించాయి. 

ఇవీ చూడండి: హరోంహరా! శివశంకరా.. కార్తికం వచ్చెరా...

Last Updated : Nov 12, 2020, 8:21 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.