సంగం డెయిరీని ప్రభుత్వం అధీనంలోకి తీసుకుంటూ ఇచ్చిన జీవోను ఏపీ హైకోర్టు నిలుపుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు డైరెక్టర్లు సాధారణ కార్యకలాపాలు నిర్వహించుకోవచ్చని న్యాయస్థానం వెల్లడించింది. న్యాయం చేయాలంటూ సంగం డెయిరీ డైరెక్టర్లు కోర్టును ఆశ్రయించిన నేపథ్యంలో ప్రభుత్వ జీవోను రద్దు చేస్తూ ఆదేశాలు జారీ చేసింది.
డెయిరీ స్థిర, చరాస్తులు అమ్మాలంటే కోర్టు అనుమతి తీసుకోవాలని న్యాయస్థానం సూచించింది. డెయిరీపై ఆధిపత్యం డైరెక్టర్లకే ఉంటుందని స్పష్టం చేసింది.
ఇదీ చూడండి : పార్టీ నిర్ణయానికి ప్రతి ఒక్కరూ కట్టుబడి ఉండాలి: ఎర్రబెల్లి