ETV Bharat / city

బార్లు, పబ్‌లు, జిమ్‌లు, థియేటర్లపై ఆంక్షలేవి?: హైకోర్టు - telangana varthalu

రెండో దశ కరోనా వేగంగా వ్యాప్తి చెందుతున్న వేళ మద్యం దుకాణాలు, బార్లు, పబ్‌లు, జిమ్‌లు, థియేటర్లపై ఆంక్షలు ఎందుకు విధించడం లేదని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది. ఆర్టీపీసీఆర్​ పరీక్షలు చాలా తక్కువగా చేస్తున్నారని ఉన్నత న్యాయస్థానం అసంతృప్తి వ్యక్తం చేసింది. 24 గంటలూ వ్యాక్సిన్లు వేసేందుకు ఎందుకు ఏర్పాట్లు చేయడం లేదో చెప్పాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. పాలనపరమైన ఉత్తర్వులు తాము ఇవ్వబోమని.. అయితే ప్రభుత్వం స్పందించపోతే ప్రజల ఆరోగ్యం కోసం తగిన ఆదేశాలు జారీ చేస్తామని ధర్మాసనం స్పష్టం చేసింది.

high court hearing on corona cases
బార్లు, పబ్‌లు, జిమ్‌లు, సినిమా థియేటర్లపై ఆంక్షలేవి?: హైకోర్టు
author img

By

Published : Apr 6, 2021, 7:12 PM IST

రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ హిమా కోహ్లి, జస్టిస్ బి. విజయ సేన్ రెడ్డి ధర్మాసనం మరోసారి విచారణ చేపట్టింది. రాష్ట్రంలో కరోనా పరీక్షలు, చికిత్సలు, నివారణ చర్యలను వివరిస్తూ వైద్యారోగ్య శాఖ హైకోర్టుకు నివేదిక సమర్పించింది. రాష్ట్రంలో విద్యా సంస్థలు మూసివేశామని.. మాస్కులు తప్పనిసరి చేస్తూ ఉత్తర్వులు జారీ చేశామని ప్రభుత్వం నివేదించింది. గత నెల 16 నుంచి 31 వరకు రాష్ట్రంలో 9 లక్షల 11 వేల కరోనా పరీక్షలు జరిపామని.. అందులో 7 లక్షల 63 వేలు రాపిడ్ యాంటీ జెన్, లక్షా 43 వేలు ఆర్టీపీసీఆర్​ అని వివరించింది. అయితే... ప్రభుత్వం.. తప్పుదోవపట్టించే నివేదిక సమర్పించిందని హైకోర్టు వ్యాఖ్యానించింది.

ఇంత నెమ్మదిగా స్పందిస్తారా..?

ఆర్టీపీసీఆర్​ పరీక్షలు పెంచాలన్న గత ఉత్తర్వులను పాటించలేదని అసహనం వ్యక్తం చేసింది. మొత్తం పరీక్షల్లో ఆర్టీపీసీఆర్​ 10 శాతం కూడా లేవని పేర్కొంది. ర్యాపిడ్ యాంటీజెన్ పరీక్షల కచ్చితత్వంపై అనేక అనుమానాలు ఉన్నాయని.. ఆర్టీపీసీఆర్​ అత్యుత్తమ మార్గమని తెలిపింది. వరంగల్, కరీంనగర్, మేడ్చల్, రంగారెడ్డి వంటి ప్రాంతాల్లో ఆర్టీపీసీఆర్​ పరీక్షలు పెంచాల్సిందేనని స్పష్టం చేసింది. ఆర్టీపీసీఆర్​ కన్నా రాపిడ్ యాంటీజెన్ పరీక్షలపైకే ఎందుకు ఎక్కువ ప్రాధాన్యమిస్తున్నారో వివరించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. రోజు రోజూ నెమ్మదిగా పరీక్షలు పెంచుతున్నామని అడ్వకేట్ జనరల్ బీఎస్​ ప్రసాద్ పేర్కొన్నారు. ఓవైపు కరోనా రెండో దశ వేగంగా విస్తరిస్తూ.. ప్రజల ఆరోగ్యం గాల్లో తేలాడుతుంటే.. ఇంకా నెమ్మదిగానే స్పందిస్తారా అని ధర్మాసనం వ్యాఖ్యానించింది.

నడక దూరంలో వ్యాక్సినేషన్​ కేంద్రాలు ఉండాలి...

రాష్ట్రంలో మద్యం దుకాణాలు, బార్లు, పబ్‌లు, జిమ్‌లు, సినిమా థియేటర్లపై ఎందుకు ఆంక్షలు విధించడం లేదో తెలపాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. వివాహాలు, అంత్యక్రియలు, విందుల్లో జనం గుమిగూడకుండా ఎలాంటి చర్యలు తీసుకున్నారో తెలపాలని ఆదేశించింది. వ్యాక్సిన్లు తగిన సంఖ్యలో ఉన్నాయని చెబుతున్నందున.. 24 గంటలూ వ్యాక్సిన్లు వేసేందుకు ఎందుకు ఏర్పాట్లు చేయడం లేదని ప్రశ్నించింది. ప్రజలకు నడక దూరంలో వ్యాక్సినేషన్ కేంద్రాలు ఉండాలని అభిప్రాయపడింది. రాష్ట్రంలో కరోనా చికిత్స అందుబాటులో ఉన్న ఆస్పత్రుల వివరాలను విస్తృతంగా ప్రచారం చేయాలని ధర్మాసనం ఆదేశించింది.

జరిమానా ఎంత విధించారు..?

రాష్ట్రంలో మరణాలు, పాజిటివ్ రేటు, జిల్లాల వారీగా మైక్రో కంటోన్మెంట్ జోన్లు, సీరో సర్వేలెన్స్ చర్యలను వివరించాలని ఆదేశాలు జారీ చేసింది. బస్ స్టేషన్లు, రైల్వే స్టేషన్లు, ఎయిర్ పోర్టులు, నిర్మాణ కేంద్రాల్లో కరోనా పరీక్షల కోసం ఎలాంటి ఏర్పాట్లు చేశారో వివరించాలని తెలిపింది. అనాథ, వృద్ధాశ్రమాలపై ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ వహించాలని స్పష్టం చేసింది. కరోనా మార్గదర్శకాలు, నిబంధనల అమలుకు ఎలాంటి చర్యలు తీసుకున్నారు.. నిబంధలు అతిక్రమించిన వారిపై ఎన్ని కేసులు నమోదు చేశారు? జరిమానా ఎంత విధించారో వివరించాలని ఆదేశించింది.

48 గంటల్లో సమర్పించాలి..

సమగ్ర వివరాలతో 48 గంటల్లో నివేదిక సమర్పించాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. పరిపాలనపరమైన అంశాల్లో జోక్యం చేసుకోమని.. అయితే ప్రభుత్వం నుంచి స్పందన లేనప్పుడు ప్రజారోగ్యం దృష్ట్యా తగిన ఆదేశాలు జారీ చేస్తామని హైకోర్టు పేర్కొంది. కరోనాపై కేసులను తమకు వ్యతిరేకంగా దాఖలైన వ్యాజ్యాలుగా సర్కారు భావించవద్దని వ్యాఖ్యానించింది. తదుపరి విచారణను ఈనెల 8కి వాయిదా వేసింది.

ఇదీ చదవండి: కరోనాతో ప్రైవేటు ఆస్పత్రులకు పరుగులు.. చికిత్స కోసం అప్పులపాలు!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.