లాక్డౌన్ మొదలైనప్పటి నుంచి 9నెలలుగా రాత్రింబవళ్లు శ్రమించి సేవలందిస్తున్న పోలీసులను రాష్ట్ర హైకోర్టు చీఫ్ జస్టిస్ రాఘవేంద్ర చౌహాన్ ప్రశంసించారు. కరోనా వ్యాప్తి నివారణకు ప్రజల్లో అవగాహన కల్పిస్తూ, నిరంతరం పనిచేసిన హైదరాబాద్ సిటీ పోలీసులతోపాటు ఇతర జిల్లాల పోలీసులను చౌహాన్ అభినందించారు.
కరోనా వారియర్స్‌కు సేవలందిస్తూ ప్రాణాలు వదిలిన పోలీసులకు సంతాపం తెలిపిన చౌహాన్.. వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. ఖైరతాబాద్‌లోని విశ్వేశ్వరయ్య ఇంజినీర్స్ భవన్లో సిటీ పోలీసు విభాగం రూపొందించిన కాప్స్ వర్సెస్ కొవిడ్ 19 అనే పుస్తకాన్ని చీఫ్ జస్టిస్ రాఘవేంద్ర సింగ్ చౌహాన్ సీఎస్ సోమేశ్ కుమార్‌తో కలిసి ఆవిష్కరించారు.
కరోనా ప్రభావం ఇంకా తగ్గలేదని.. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని జస్టిస్ చౌహాన్ సూచించారు. మరికొన్ని వారాల్లో వాక్సిన్ వస్తుందని సీపీ అంజనీ కుమార్ వెల్లడించారు.