ETV Bharat / city

ఇదేం వింత సామీ.. ఆక్సిజన్ లేకుండానే బతికేస్తోంది..!! - how many creatures in the world

ఆక్సిజన్ తీసుకోవడంలో జీవుల మధ్య హెచ్చు తగ్గులుంటాయి. ఎలుక నిమిషానికి 85 సార్లు ఊపిరి తీసుకుంటే.. తాబేలు నాలుగు సార్లకు మించి గాలి పీల్చదు. మిగిలిన జీవులన్నీ వాటి శరీర నిర్మాణ ధర్మాన్ని అనుసరించి శ్వాసిస్తాయి. కానీ.. అసలు గాలే పీల్చకుండా.. ఆక్సిజన్ అవసరమే లేకుండా.. ఈ భూమ్మీద ఏదైనా జీవి బతుకుతుందా? ఈ ప్రశ్నకు అందరూ "నో" అనే అంటారు. కానీ.. నేనున్నా అంటూ చెయ్యెత్తుతోంది ఓ జీవి..! సైంటిస్టులతోనే నోరెళ్లబెట్టించిన ఆ జీవి ఏదో.. ఎక్కడ ఉంటుందో.. తెలుసుకోండి మరి.

ఇదేం వింత సామీ.. ఆక్సిజన్ లేకుండానే బతికేస్తోంది..!!

author img

By

Published : Sep 9, 2022, 9:37 PM IST

ఈ భూమ్మీద దాదాపు 87 లక్షల జీవులున్నాయి. ఇవి తీరొక్క ఆహారం తింటాయి. ఒక్కో ప్రాంతంలో.. ఒక్కో రకం వాతావరణంలో నివసిస్తుంటాయి. కానీ.. వీటన్నింటికీ కామన్ అవసరం ఒక్కటే. అదే ఆక్సిజన్. గాలి పీల్చకపోతే ఏ ప్రాణీ బతకదు. కానీ.. ఒక జీవి మాత్రం ఆక్సిజన్ పీల్చకుండానే హాయిగా బతికేస్తోంది! నమ్మశక్యంగా లేకున్నా.. ఇది వాస్తవం. మరి, ఇదెలా సాధ్యం? ఇంతకీ ఆ జీవి ఏది? అన్నది చూద్దాం. ఆ ప్రాణి పేరు "హెన్నెగుయా సాల్మినికోలా". ఇదొక టాడ్‌పోల్‌ లాంటి పరాన్నజీవి. నీళ్లలో జీవించే అక్వాటిక్‌ లార్వా వంటిది. ఇతర జీవులపై బతుకుతుంది.

హెన్నెగుయా సాల్మినికోలా
హెన్నెగుయా సాల్మినికోలా

ఈ జీవిపై అమెరికాలోని ఓ యూనివర్సిటీకి చెందిన సైంటిస్టులు రీసెర్చ్ చేశారు. ఆ సమయంలో కనిపించిన అద్భుతాన్ని చూసి వారు ఆశ్చర్యపోయారు. ఈ పరాన్నజీవిలో.. మైటో కాండ్రియల్‌ జన్యువులు లేవని గుర్తించారు. ఈ మైటోకాండ్రియా ఎంత కీలకం అంటే.. జీవులకు కావాల్సిన శక్తిని సృష్టించేది మైటోకాండ్రియానే. ఈ శక్తిని ఉత్పత్తి చేయడానికి ఆక్సిజన్ కంపల్సరీ. అలాంటిది అసలు మైటో కాండ్రియల్ జన్యువులే ఈ జీవిలో లేకపోవడం విశేషం. సో.. ఈ జీవికి ఆక్సిజన్ అవసరమే లేదన్నమాట.

హెన్నెగుయా సాల్మినికోలా
హెన్నెగుయా సాల్మినికోలా

అమీబా, శిలీంధ్రాలు వంటి ఏకకణ జీవులు కూడా ఆక్సిజన్ లేని వాతావరణంలో జీవించగల సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి. అయితే.. పూర్తిగా కాదు. వాటికి కొంతైనా ఆక్సిజన్‌ అవసరం ఉంటుంది. కానీ.. వీటికి ఆ కొద్దిపాటి ఆక్సిజన్‌ కూడా అవసరం లేదట. ఇక్కడ మీకో డౌట్ వస్తుంది. మైటో కాండ్రియా లేకపోతే.. కణాల్లో శక్తి ఉత్పత్తి కాదుకదా? ఆ శక్తి లేకపోతే.. జీవి మనుగడ సాగించడం అసాధ్యం కదా? అనే సందేహం కలుగుతుంది. ఈ విషయాన్ని ఇంకా కనుక్కోలేదట పరిశోధకులు. ఈ పరాన్నజీవి ఏ విధంగా శక్తిని ఉత్పత్తి చేసుకుంటోంది? ఇందుకోసం "హెన్నెగుయా సాల్మినికోలా" జీవి శరీరంలో ఎలాంటి నిర్మాణం ఉంది? అన్న విషయం తెలుసుకోవాల్సి ఉంది. దీన్ని త్వరలోనే గుర్తిస్తామని చెప్తున్నారు. మొత్తానికి.. ఆక్సిజన్ లేకుండా జీవిస్తున్న ప్రాణి ఈ భూమ్మీద ఉందన్నమాట. భలే విచిత్రం కదూ..!

హెన్నెగుయా సాల్మినికోలా
హెన్నెగుయా సాల్మినికోలా

ఇవీ చూడండి..:

ఫైవ్ స్టార్ హోటల్లో పందుల పెంపకం.. ఇదేందయ్యా ఇదీ..!?

మనుషులకు తోకలు మొలుస్తున్నాయ్.. ఇట్స్ ట్రూ యార్..!

అక్కడ రాళ్లు నడుస్తాయి.. పరిగెడతాయి..!!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.