ETV Bharat / city

రాష్ట్రంలో కురుస్తున్న వర్షాలతో రైతన్న కష్టాలు - రాష్ట్రంలో మోస్తరు వర్షాలు

రాష్ట్రవ్యాప్తంగా పలు చోట్ల గురువారం ఓ మోస్తరు వర్షాలు కురిసాయి. హైదరాబాద్‌, సికింద్రాబాద్‌, వరంగల్‌ నగర వీధులన్నీ జలమయమయ్యాయి. కామారెడ్డి, నిర్మల్‌ జిల్లాలో సోయా, మొక్కజొన్న పంట నీటిలో తడిసాయి. ఆరుగాలం కష్టపడి పండించి పంట కోసే సమయంలో వర్షాలు రావడం వల్ల రైతులు ఆందోళన చెందుతున్నారు.

రాష్ట్రంలో కురుస్తున్న వర్షాలతో రైతన్న కష్టాలు
author img

By

Published : Oct 25, 2019, 6:01 AM IST

ఉపరితల ఆవర్తన అల్పపీడనం ప్రభావంతో కురిసిన వర్షాలు నగరాన్ని అతలాకుతలం చేస్తున్నాయి. హైదరాబాద్‌లోని బేగంబజార్, కోఠి, సుల్తాన్ బజార్, అబిడ్స్, నాంపల్లి, బషీర్‌బాగ్, లిబర్టీ, హిమాయత్ నగర్, లక్డీకాపూల్‌లో ఓ మోస్తారు వర్షం కురిసింది. అసెంబ్లీ ఎదురుగా రోడ్డుపై నీరు నిలిచి వాహనదారులు, బాట సారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. సికింద్రాబాద్‌లోని బోయిన్‌పల్లి, తిరుమలగిరి, అల్వాల్, బొల్లారం, మారేడుపల్లి, బేగంపేట, ప్యాట్నీ, ప్యారడైస్, మారేడుపల్లి, చిలకలగూడా, పద్మారావునగర్‌, సంగీత్‌ ప్రాంతాల్లో... ఎడతెరపి లేకుండా గంట పాటు కురిసిన వర్షంతో ప్రజలు ఇబ్బంది పడ్డారు.

రోడ్లు జలమయం

రాజన్నసిరిసిల్ల జిల్లా కేంద్రంలో కురిసిన వర్షానికి రోడ్లపైకి భారీగా నీరు చేరింది. పాత బస్టాండ్‌ ప్రాంతంలో మురికి కాలువలు పొంగిపొర్లాయి. అధికారులు స్పందిచి తగు చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. వరంగల్‌లో గురువారం సాయంత్రం ఉరుములతో కూడిన కుండపోత వర్షానికి నగర వీధులు జలమయమయ్యాయి. రోడ్లపై మోకాళ్ల లోతు నీరు నిలిచి వాహనదారులు, బాటసారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. విద్యార్థుల పాఠశాల నుంచి ఇంటికి వెళ్లేందుకు నానా అవస్థలు పడ్డారు. వరంగల్‌ అర్బన్‌ జిల్లా కాజీపేట, హసన్‌పర్తి, ధర్మాసాగర్‌, వేలేరు మండలాల్లో గంటసేపు ఎడతెరపి లేకుండా వర్షం పడింది.

చేతికొచ్చిన పంట నీటిపాలు

కామారెడ్డిలో కురిసిన వర్షాలకు పట్టణ వీధులన్నీ జలమయమయ్యాయి. వ్యవసాయ మార్కెట్‌ యార్డులో ఆరబెట్టిన మొక్కజొన్న వర్షం నీటిలో కొట్టుకుపోయింది. ఆరుగాలం కష్టపడి పండించిన రైతులు కన్నీరుమున్నీరవుతున్నారు. నిర్మల్‌ జిల్లా ముథోల్‌, తానూర్‌, బాసర, బైంసా మండలాల్లో మోస్తరు వర్షం కురిసింది. పంట కోతకు వచ్చిన సమయంలో వర్షం రావడం వల్ల రైతులు కలవరపడుతున్నారు. సోయా, మొక్కజొన్న పంటలు ఆబెట్టేందుకు సమయం లేకుండా వాన కురిస్తున్నాయని రైతన్నలు ఆందోళన చెందుతున్నారు.

రాష్ట్రంలో కురుస్తున్న వర్షాలతో రైతన్న కష్టాలు

ఇదీ చూడండి: ఎల్లుండి హుజూర్‌నగర్‌లో కృతజ్ఞత సభ: కేసీఆర్

TG_Hyd_31_24_Rain In City_Av_TS10005 Note: Feed Ftp Contributor: Bhushanam ( ) హైదరాబాద్ నగరంలో ని పలు ఫ్రాతాలలో ఓ మోస్తారు వర్షం కురిసింది. బేగంబజార్, కోఠి, సుల్తాన్ బజార్, అబిడ్స్, నాంపల్లి, బషీర్ బాగ్, లిబర్టీ, హిమాయత్ నగర్, లక్కిడికపుల్ తదితర ప్రాంతాల్లో ఓ మోస్తారు వర్షం కురిసింది. అసెంబ్లీ ఎదురుగా రోడ్డుపై నీరు రావడంతో వాహన దారులు, బాట సారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఒక్క సారిగా వర్షం కురియడంతో ప్రజలు తడిసి ముద్దయ్యారు. విజువల్స్.....
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.