ETV Bharat / city

Nellore floods: భారీ వర్షాలకు నెల్లూరులో తెగిన రహదారులు, దెబ్బతిన్న రైల్వేలైన్లు - ఏపీ వార్తలు

భారీ వర్షాల కారణంగా ఏపీలోని నెల్లూరు జిల్లాలో పలు రహదారులు, రైల్వే లైన్లు, వంతెనలు(Nellore flood effect) దెబ్బతిన్నాయి. ఫలితంగా వాహనాల రాకపోకలు స్తంభించాయి. ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

Nellore floods
Nellore floods
author img

By

Published : Nov 21, 2021, 2:55 PM IST

భారీ వర్షాలకు నెల్లూరులో తెగిన రహదారులు, దెబ్బతిన్న రైల్వేలైన్లు

భారీ వర్షాలతో ఏపీలోని నెల్లూరు జిల్లాలో(nellore flood effect) గల రహదారులు దెబ్బతిన్నాయి. వంతెనలు బలహీనపడి కూలిపోయే స్థితిలో ఉన్నాయి. అప్రమత్తమైన అధికారులు వాహనాల రాకపోకల్ని నిలిపేశారు. రహదారులకు మరమ్మతులు చేస్తున్నారు. నెల్లూరు శివారులో పెన్నా నదిపై వంతెన బలహీనపడింది. దాంతో అర్ధరాత్రి 12 నుంచే జాతీయరహదారిపై వాహనాలు నిలిపివేశారు. మరోవైపు పెన్నానది వద్ద 16వ నంబరు జాతీయ రహదారికి గండి పడింది. ఫలితంగా చెన్నై, బెంగళూరు నుంచి విజయవాడ వచ్చే వాహనాలను నిలిపివేశారు. నెల్లూరు బస్టాండ్‌లో ఆర్టీసీ బస్సులు ఆగిపోయాయి. కడప - తిరుపతి మార్గంలో కూడా వాహనాల రాకపోకల్ని ఆర్టీసీ నిలిపివేసింది. చెన్నై - కోల్‌కతా 16వ నంబర్‌ జాతీయరహదారి దెబ్బతినడంతో వాహనాలు నిలిపివేశారు. వాహనాలు కడప, పామూరు, దర్శి వైపు వెళ్లాలని పోలీసులు సూచించారు. మరమ్మతులకు కనీసం 48 గంటలు పడుతుందని అధికారులు తెలిపారు. కాగా సంగం మండలం కోలగట్ల వద్ద వరద ఉద్ధృతి(nellore floods) తగ్గింది. ఫలితంగా నెల్లూరు నుంచి కడపకు వాహనాల రాకపోకలకు అనుమతినిచ్చారు.

పలు రైళ్ల రాకపోకలకు అంతరాయం-రద్దు..

భారీ వర్షాల (Heavy rains in Nellore) ధాటికి రైల్వే ట్రాక్​ దెబ్బతినడంతో తిరుపతి - ఆదిలాబాద్‌ కృష్ణా ఎక్స్‌ప్రెస్​ (Krishna Express canceled)ను రైల్వేశాఖ రద్దు చేసింది. నెల్లూరు - పడుగుపాడు మధ్య రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. వేటపాలెంలో పూరీ ఎక్స్‌ప్రెస్‌ నిలిచిపోయింది. రైళ్లలో ప్రయాణికుల అవస్థలు పడుతున్నారు.తిరుపతి నుంచి శ్రీకాళహస్తి మీదుగా వచ్చే వాహనాలను అధికారులు నిలిపివేశారు. దాంతో తొట్టంబేడు వద్ద భారీగా వాహనాలు బారులు తీరాయి.

తిరుపతిలో ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలకు(Heavy rains tirupati)నగరం జలదిగ్బంధంలో చిక్కుకుంది. లోతట్టు ప్రాంతాల్లోకి నీరు చేరింది. ఇళ్లల్లో వరద ప్రవాహంతో ముంపుప్రాంత ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. భారీ వర్షాలతో తిరుపతి నగరంలోకి వరద నీరు వచ్చి చేరుతుంది. పేరూరు, పెరుమాళ్లపల్లి చెరువుల నుంచి వరద నీరు నగరంలోకి వస్తోంది. దీంతో పట్టణంలోని పలు కాలనీల్లో వరద నీరు ఇంకా తొలగలేదు. గాయత్రినగర్‌, సరస్వతి నగర్‌, శ్రీకృష్ణనగర్‌ జలదిగ్బంధంలోనే ఉన్నాయి. ముత్యాలరెడ్డిపల్లి, ఉల్లిపట్టెడ, దుర్గానగర్‌ ప్రాంతాలు నీటలోనే తేలుతున్నాయి. ఆటోనగర్‌ లోని వెయ్యి కుటుంబాలు గత నాలుగు రోజులుగా ఇళ్లకే పరిమితమయ్యాయి. పునరావాస కేంద్రాల్లో పెద్ద ఎత్తున బాధితుల చేరుకున్నారు. ఇంకా జలదిగ్బంధంలో పద్మావతీ మహిళా విశ్వవిద్యాలయం ఉంది.

ఇదీ చదవండి: kovvur Highway Damaged: భారీ వరదలతో కోవూరు వద్ద కోతకు గురైన హైవే..!

వరద ఉద్ధృతిలో బైక్​తో సహా కొట్టుకుపోయాడు- చివరకు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.