ETV Bharat / city

హైదరాబాద్​లో ఈదురుగాలులతో కూడిన వర్షం.. కార్లు ధ్వంసం.. - Heavy Rain in several places of Hyderabad

Heavy Rain in Hyderabad: మూడు రోజులుగా భానుడు తన ప్రతాపం చూపిస్తుండగా.. నేడు వరుణుడి రాకతో హైదరాబాద్​ వాసులకు కొంత ఉపశమనం కలిగింది. నగరం​లోని పలు ప్రాంతాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షం కురుస్తోంది. మరోవైపు రానున్న రెండు రోజులు పలు చోట్ల మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది.

Heavy Rain in several places of Hyderabad

author img

By

Published : May 26, 2022, 4:27 PM IST

Updated : May 26, 2022, 11:53 PM IST

Heavy Rain in Hyderabad: హైదరాబాద్​లోని పలు చోట్ల ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసింది. నగరంలోని జీడిమెట్ల, షాపూర్ నగర్, సూరారం, కుత్బుల్లాపూర్, సుచిత్ర, కొంపల్లి, గచ్చిబౌలి, చంపాపేట్‌, కర్మన్‌ఘాట్‌, సరూర్‌నగర్‌, సైదాబాద్‌, అంబర్‌పేట్‌లో ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసింది. భారీగా ఈదురుగాలులు వీయడంతో నాంపల్లిలోని ఆర్డీవో కార్యాలయ సమీపంలో నిర్మాణంలో ఉన్న ఓ భవనం నుంచి ఇనుప రేకులు ఎగిరి పడి అటుగా వెళ్తున్న వాహనాలపై పడ్డాయి. దీంతో నాంపల్లి ప్రధాన రోడ్డు కూడలిలో 3 కార్లు ధ్వంసం కాగా.. ఇద్దరికి స్వల్ప గాయాలయ్యాయి. నగరంలోని మరికొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షం కురిసింది.

Heavy Rain in several places of Hyderabad
ఈదురుగాలులకు నాంపల్లిలో ఓ భవనంపై ఎగిరిపోయిన ఇనుప రేకులు

సాయంత్రం నగరంలో కురిసిన భారీ వర్షాలకు షేక్​పేటలోని మారుతి నగర్ వద్ద పెద్ద చెట్టు కుప్పకూలింది. పక్కనే పార్క్ చేసి ఉన్న ఒక కారు, రెండు ద్విచక్ర వాహనాలు స్వల్పంగా ధ్వంసమయ్యాయి. సంఘటనా స్థలానికి చేరుకున్న డీఆర్​ఎఫ్​ బృందాలు యంత్రాల కూలిన చెట్టును తొలగించారు. సుమారు మూడు గంటల పాటు విద్యుత్​కు అంతరాయం కలిగింది. ఈదురుగాలుల వల్ల స్థానికులు ఇబ్బందులకు గురయ్యారు.

నేలకొరిగిన భారీ వృక్షం
నేలకొరిగిన భారీ వృక్షం

సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు, మియాపూర్‌, చందానగర్‌, శేరిలింగంపల్లి, దుండిగల్‌లో ఉరుములతో కూడిన భారీ వర్షం కురిసింది. సంగారెడ్డి జిల్లా గుమ్మడిదలలో వడగండ్ల వర్షం పడింది. సికింద్రాబాద్‌ పరిధిలోని బోయిన్‌పల్లి, ఆల్వాల్, తిరుమలగిరి, చిలకలగూడ, మారేడుపల్లి, బేగంపేట్, ప్యారడైజ్, ప్యాట్నీ సెంటర్‌ ప్రాంతాల్లో చిరుజల్లులు పడ్డాయి.

గుమ్మడిదలలో వడగండ్ల వర్షం

రెండు రోజులు వర్షాలు: రాష్ట్రంలో రానున్న రెండు రోజులు ఉరుములు మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. నైరుతి రుతుపవనాలు నైరుతి అరేబియా సముద్రంలోని కొన్ని ప్రాంతాలు, ఆగ్నేయ అరేబియా సముద్రం మాల్దీవులు, కొమోరిన్ ప్రాంతం దక్షిణ బంగాళాఖాతంలోని మరికొన్ని ప్రాంతాల్లోకి మరింత ముందుకు వ్యాపించాయని వాతావరణ కేంద్రం వివరించింది. ఉత్తర దక్షిణ ద్రోణి ఉత్తర ఇంటీరియర్ కర్ణాటక నుంచి దక్షిణ తమిళనాడు వరకు సగటు సముద్ర మట్టం నుంచి 0.9 కి.మీ. ఎత్త వరకు స్థిరంగా కొనసాగుతుందని వాతావరణ కేంద్రం తెలిపింది.

హైదరాబాద్​లోని పలు ప్రాంతాల్లో వర్షం

ఇవీ చూడండి:

Last Updated : May 26, 2022, 11:53 PM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.