ETV Bharat / city

తడిసిముద్దైన సికింద్రాబాద్.. రికార్డ్ స్థాయిలో వర్షం..

మంగళవారం కురిసిన భారీవర్షంతో సికింద్రాబాద్ నగరం తడిసి ముద్దైంది. సాయంత్రం నుంచి తెల్లవారుజాము వరకు కురిసిన వానతో లోతట్టు ప్రాంతాలతో పాటు.. ప్రధాన రహదారులు నదులను తలపించాయి.

తడిసిముద్దైన సికింద్రాబాద్.. రికార్డ్ స్థాయిలో వర్షం..
author img

By

Published : Sep 25, 2019, 9:12 AM IST

Updated : Sep 25, 2019, 10:29 AM IST

నిన్న సాయంత్రం నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు సికింద్రాబాద్ నగరం అతలాకుతమైంది. ప్రధానంగా మారేడ్​పల్లి బోయిన్​పల్లి తిరుమలగిరిలో అత్యధికంగా 12 సెంటీమీటర్ల వర్షం పడింది. ప్యాట్ని, ప్యారడైజ్, కార్ఖానా, అల్వాల్ ప్రాంతాల్లో రాత్రంగా కురిసిన వానకు.. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి.

రోడ్లు, కాలువలు కలిసిపోయాయి...

వరదనీటితో రోడ్లన్నీ పొంగిపొర్లుతున్నాయి. డ్రైనేజీలు పొంగిపొర్లి రహదారులపైకి చేరాయి. ఫలితంగా ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. పలుచోట్ల ట్రాఫిక్ జామ్​లతో నగర వాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

ఇళ్లలోకి నీరు.. తడిచిపోయిన వస్తువులు...

కార్ఖానా పరిధిలోని వాసవి నగర్​లో ఇళ్లలోకి నీరు చేరడంతో స్థానికులు ఆందోళనకు గురయ్యారు. పలుచోట్ల సామగ్రి పూర్తిగా తడిసిపోయి పనికిరాకుండా అయ్యాయని వాపోయారు. లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ప్రజలు ఇళ్లలోకి వచ్చిన నీటిని ఎత్తి బయటపోస్తున్నారు. స్థానిక డిమార్ట్​లోకి కూడా వరద నీరు వచ్చి భారీనష్టం జరిగింది.

పరిస్థితి ఇంత దయనీయంగా ఉన్నా.. అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోలేదని మండిపడుతున్నారు.

తడిసిముద్దైన సికింద్రాబాద్.. రికార్డ్ స్థాయిలో వర్షం..

ఇవీచూడండి: భాగ్యనగరంలో భారీవర్షం.. రోడ్లన్నీ జలమయం

Intro:సికింద్రాబాద్ యాంకర్.. నిన్న సాయంత్రం నుండి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు నగరం అతలాకుతలం అయింది..ప్రధానంగా సికింద్రాబాదులోని మారేడిపల్లి బోయిన్పల్లి తిరుమలగిరి ప్యాట్ని ప్యారడైస్ కార్ఖానా అల్వాల్ ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది..ఈ భారీ వర్షానికి లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి రోడ్లన్నీ పొంగిపొర్లుతున్నాయి డ్రైనేజీలు పొంగిపొర్లుతున్న డంతో ప్రయాణికులు రహదారిలో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు..కార్ఖానా లోని వాసవి నగరాలలో ఇళ్లలోకి నీరు చేరడంతో స్థానికులు ఆందోళనకు గురయ్యారు...ఇల్లు లోకి నీరు చేరడంతో సామగ్రి పూర్తిగా తడిసిపోయి పనికిరాకుండా అయ్యాయని అన్నారు...సంగీత ధన డిమార్ట్ లోకి కూడా వరద నీరు వచ్చి చేరడంతో కొనుగోలుదారులకు తీవ్ర ఇబ్బందికర వాతావరణం ఉంది..సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గ పరిధిలోని రోడ్డు చుసిన నిండుకుండను తలపిస్తున్నయి..పలుచోట్ల ట్రాఫిక్ జామ్ లతో నగర వాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు..లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ప్రజలు ఇళ్లలోకి నీరు చేరడంతో వారు నీటిని ఎత్తి బయటపోస్తున్నారు.. అధికారులు ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని వారు వాపోతున్నారు.. Body:వంశీConclusion:7032401099
Last Updated : Sep 25, 2019, 10:29 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.