ఎగువ ప్రాంతాల్లో వర్షాలు విస్తారంగా కురుస్తున్న తరుణంలో శ్రీశైలం జలాశయానికి భారీగా వరదనీరు వచ్చి చేరుతోంది. మంగళవారం జలాశయం ఇన్ ఫ్లో 1,07,316 క్యూసెక్కులు, అవుట్ ఫ్లో 38,140 క్యూసెక్కులుగా నమోదు అయ్యింది. జలాశయం పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా.. ప్రస్తుతం నీటి మట్టం 844.20 అడుగులకు చేరింది.
పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 215.807 టీఎంసీలు కాగా... ప్రస్తుతం నీటి నిల్వ సామర్థ్యం 68.7145 టీఎంసీలుగా ఉంది. శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం అధికంగా ఉన్నందున.. ఎడమ గట్టు భూగర్భ జలవిద్యుత్ కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోంది.
ఇదీ చదవండి: