ETV Bharat / city

సొంతూళ్లకు పయనమవుతున్న జనాలు... కిక్కిరిసిపోయిన బస్టాండ్లు - loc down 2.0

లాక్​డౌన్​ ప్రకటన వెలువడ్డ వెంటనే పెట్టేబేడా సర్ధుకుని ప్రజలు సొంతూళ్లకు పయనమవుతున్నారు. బస్సు, రైలు, బండి, కారు... ఏదైతే అది అంటూ స్వగ్రామాలకు ప్రయాణం సాగిస్తున్నారు. గతేడాది ఇబ్బందులను దృష్టిలో ఉంచుకున్న ప్రజలు... ఎలాగైనా సొంతూళ్లకు వెళ్లాలనే తపనతో బస్టాండ్లు, రైల్వేస్టేషన్లలో బారులు తీరారు.

heavy crowd in bus stands and railway stations in hyderabad

author img

By

Published : May 11, 2021, 9:56 PM IST

రాష్ట్రంలో రేపట్నుంచి ఈనెల 21 వరకు లాక్‌డౌన్‌ అమలు కానున్న నేపథ్యంలో ప్రజలు స్వగ్రామాలకు పయనమవుతున్నారు. హైదరాబాద్​లో ఉపాధి పనులు చేసుకుంటున్న చాలా మంది కూలీలు, ఉద్యోగులు స్వస్థలాలకు వెళ్తున్నారు. బస్టాండులు, రైల్వే స్టేషన్లు ప్రయాణికులతో రద్దీగా మారిపోయాయి. జేబీఎస్, ఎంజీబీఎస్ బస్టాండ్లు, సికింద్రాబాద్, కాచిగూడ, హైదరాబాద్ రైల్వే స్టేషన్లు ప్రయాణికులతో కిటకిటలాడుతున్నాయి. రైల్వే స్టేషన్లలో రిజర్వేషన్ టికెట్ ఉన్న వారికి మాత్రమే అనుమతి ఇవ్వడం వల్ల మిగితా ప్రయాణికులు రైల్వేస్టేషన్ పరిసర ప్రాంతాల్లో వేచి చేస్తున్నారు.

ఇక బస్సుల్లో వెళ్లే ప్రయాణికులు మాత్రం ఒకే బస్సులో రెండు బస్సులకు సరిపడా ఎక్కి వెళుతున్నారు. బస్సుల్లో ప్రయాణించే వారు ఎక్కడా కూడా భౌతికదూరం పాటించడంలేదు. కొంతమంది మాస్కులు సైతం పెట్టుకోకుండానే ప్రయాణం సాగిస్తున్నారు. ఏ బస్సు వచ్చినా.. పరుగెత్తుకుని వెళుతున్నారు. ఒక్కసారిగా ప్రయాణికులు ఎక్కువ అవటం... బస్సులు తక్కువగా ఉండడం వల్ల గందరగోళ పరిస్థితి నెలకొంది. మరిన్ని బస్సులను సమకూర్చాలని ఆర్టీసీ యాజమాన్యానికి ప్రయాణికులు విజ్ఞప్తి చేస్తున్నారు.

బస్సులు, రైళ్లు అనే కాకుండా... ప్రైవేటు వాహనాల్లో కూడా ప్రజలు ప్రయాణమవుతున్నారు. స్వగ్రామాలకు చేరటమే లక్ష్యంగా... ఏది దొరికితే అది పట్టుకుని వెళ్తున్నారు. ఇదే అదునుగా చేసుకుని ప్రైవేటు వావనాలు ప్రయాణికుల వద్ద రెట్టింపు ఛార్జీలు వసూలు చేస్తున్నారు. గతేడాది అనుభవాలను దృష్టిలో పెట్టుకున్న ప్రజలు ముందుజాగ్రత్తగా... అధిక ఛార్జీలను సైతం భరిస్తూ స్వగ్రామాలకు పయనమవుతున్నారు.

మరోవైపు... ఆర్టీసీ కూడా రేపటి నుంచి బస్సుల ప్రయాణ సమయాన్ని కుదించింది. ఉదయం 6 గంటల నుంచి పది గంటల వరకు అంటే కేవలం నాలుగు గంటలు మాత్రమే ఆర్టీసీ సిటీ బస్సులు, జిల్లాలకు వెళ్లే బస్సులను నడిపిస్తామని ప్రకటించింది. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్​లో కర్ఫ్యూ కొనసాగుతున్న నేపథ్యంలో అటుగా నడిపించే అన్ని సేవలను రద్దు చేసింది. మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాలకు సైతం కార్గో, కొరియర్ సర్వీసులను రద్దు చేసింది. ప్రయాణికులు ఈ సమయాలను దృష్టిలో పెట్టుకుని ప్రయాణాలు చేయాల్సిందిగా ఆర్టీసీ అధికారులు విజ్ఞప్తి చేశారు.

ఇదీ చూడండి: లాక్​డౌన్​ ఎఫెక్ట్​: వైన్సుల ముందు బారులు తీరిన మందుబాబులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.