Telangana Temperature: రాష్ట్రంలో ఎండలు మండుతున్నాయి. ఉదయం నుంచే సూర్యుడు భగ్గుమంటున్నాడు. బయట అడుగు వేస్తే నిప్పుల కొలిమిలో అడుగు వేసినట్టు అనిపిస్తోంది. ఆదిలాబాద్ జిల్లా జైనద్‌లో అత్యధికంగా 43.0 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. ఆదిలాబాద్ జిల్లా బోరాజ్‌లో 42.6 డిగ్రీలు, ఆదిలాబాద్ అర్బన్ 42.3, నిర్మల్ నర్సాపూర్‌లో 41.8 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి.
ఉదయం 11 గంటల నుంచే రోడ్లన్నీ ఎండ తీవ్రతకు ఖాళీగా దర్శనమిస్తున్నాయి. అత్యవసర పనులకు తప్పితే జనాలు బయటకు రావడం లేదు. ఎండ తీవ్రతకు జనాలు అల్లాడుతున్నారు. బయటకు వచ్చిన వ్యక్తులు ఎండ వేడిమిని తట్టుకోలేక కొబ్బరి బొండాలు, జ్యూస్‌లు తాగుతూ ఉపశమనం పొందుతున్నారు.
ఇదీ చదవండి : 'ప్రభుత్వ ఆస్పత్రుల్లోనూ బూస్టర్ డోస్‌కు అనుమతివ్వండి'