ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్యకేసులో సీబీఐ వేసిన నార్కో పిటిషన్‌పై కడప జిల్లా జమ్మలమడుగు కోర్టులో విచారణ ముగిసింది. సునీల్ యాదవ్‌కు నార్కో పరీక్షల కోసం అనుమతి కోరుతూ సీబీఐ పిటిషన్ వేసింది. ఇప్పటికే రెండుసార్లు వాదనలు విన్న జమ్మలమడుగు కోర్టు... సీబీఐ పిటిషన్‌పై మరోసారి జమ్మలమడుగు కోర్టు విచారణ చేపట్టింది. ఈ నెల 15 వరకు సునీల్ యాదవ్ రిమాండ్ పొడిగించింది. సాయంత్రం వర్చువల్‌గా జమ్మలమడుగు మెజిస్ట్రేట్ వాదనలు విననున్నారు.
నలుగురి చుట్టే..
ఆంధ్రప్రదేశ్‌లో వివేకానందరెడ్డి హత్యకేసుకు సంబంధించి.. కాపలాదారు రంగన్న ఇచ్చిన వాంగ్మూలం మేరకు నలుగురు వ్యక్తుల ప్రమేయంపై సీబీఐ లోతుగా దర్యాప్తు చేస్తోంది. సునీల్ యాదవ్, ఎర్ర గంగిరెడ్డి, దస్తగిరి, ఉమాశంకర్‌రెడ్డి పాత్రపై.. నిశితంగా విచారణ జరుపుతోంది. 2 నెలల నుంచి ఈ నలుగురిని వరుసగా విచారణకు పిలుస్తూనే ఉన్నారు. ఇప్పటికే సునీల్ యాదవ్‌ను కస్టడీకి తీసుకుని విచారిస్తున్నారు. ఈ నలుగురి ఇళ్లే లక్ష్యంగా సీబీఐ సోదాలు నిర్వహించింది. వారి ఇళ్లలో కొన్ని ఆయుధాలు, చొక్కాలు, బ్యాంకు పుస్తకాలు స్వాధీనం చేసుకున్నారు. వివేకా మాజీ డ్రైవర్ దస్తగిరి ఇంట్లో.. రక్తపు మరకలతో కూడిన చొక్కాను సీబీఐ అధికారులు స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది.
ఇది వరకే రివార్డు ప్రకటన..
వివేకా హత్య కేసులో కచ్చితమైన, నమ్మకమైన సమాచారం ఇచ్చిన వారికి రూ.5 లక్షల రూపాయల బహుమానం ఇస్తామని ఇప్పటికే సీబీఐ ప్రకటించింది. 2019 మార్చి 15న వివేకా దారుణహత్యకు గురయ్యారని.. హై కోర్టు ఆదేశాల మేరకు గతేడాది జులై 9న వివేకా హత్యపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు సీబీఐ ప్రకటనలో పేర్కొంది. సామాన్య ప్రజలు ఎవరైనా సమాచారం అందించవచ్చని.. అలాంటి వ్యక్తుల వివరాలు గోప్యంగా ఉంచుతామని సీబీఐ ప్రకటనలో తెలిపింది. వివేకా హత్యకు సంబంధించి.. తెలిసిన సమాచారం సీబీఐ అధికారులైన దీపక్ గౌర్, రాంసింగ్ లకు అందజేయాలని వారి ఫోన్ నంబర్లు, చిరునామాను ప్రకటనలో వెల్లడించింది.
ఇదీ చదవండి: