ETV Bharat / city

సుప్రీంలో 'ఏపీ స్థానిక సమరం'.. నేడే విచారణ.. మారిన ధర్మాసనం! - ఏపీలో పంచాయతీ ఎన్నికలు న్యూస్

గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణకు అనుమతిస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం దాఖలు చేసిన కేసును విచారించనున్న సుప్రీంకోర్టు ధర్మాసనం మారింది.

hearing-on-ap-local-elections-in-supreme-court
సుప్రీంలో ఏపీ స్థానిక సమరం
author img

By

Published : Jan 25, 2021, 8:47 AM IST

ఏపీ గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణకు అనుమతిస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ ఆ రాష్ట్ర‌ ప్రభుత్వం దాఖలు చేసిన కేసును విచారించనున్న సుప్రీంకోర్టు ధర్మాసనం మారింది. పంచాయతీ ఎన్నికల కేసును తొలుత 25వ తేదీన జస్టిస్‌ లావు నాగేశ్వరరావు, జస్టిస్‌ ఎస్‌.అబ్దుల్‌ నజీర్‌, జస్టిస్‌ ఇందు మల్హోత్రాల ధర్మాసనం ముందు లిస్టు చేశారు. తాజాగా అది జస్టిస్‌ సంజయ్‌ కిషన్‌ కౌల్‌, జస్టిస్‌ హృషికేశ్‌రాయ్‌లతో కూడిన ద్విసభ్య ధర్మాసనానికి బదిలీ అయింది. ఈ మేరకు సుప్రీంకోర్టు రిజిస్ట్రీ సోమవారం విచారణ చేపట్టే కేసుల జాబితాలో మార్పులు చేసింది.

ఈ కేసులో స్పెషల్‌ లీవ్‌ పిటిషన్‌ దాఖలు చేయడానికి తమకూ అనుమతివ్వాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ ఉద్యోగుల సమాఖ్య దాఖలు చేసిన కేసూ ఇదే ధర్మాసనం ముందు విచారణకు రానుంది. రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 21న పిటిషన్‌ దాఖలు చేయగా 22న సుప్రీంకోర్టు రిజిస్ట్రీ అందులోని లోపాలను గుర్తించి సరిచేయాలని సూచించింది. ప్రభుత్వం వెంటనే ఆ పని పూర్తి చేయడంతో అధికారులు అదే రోజు కేసు నంబరు కేటాయించారు. తొలుత ఈ కేసును తాత్కాలిక ప్రాతిపదికన 29వ తేదీకి లిస్టు (కంప్యూటర్‌ జనరేటెడ్‌) చేస్తున్నట్లు సుప్రీంకోర్టు వెబ్‌సైట్‌ చూపింది. తర్వాత కొద్దిసేపటికే 25వ తేదీకే లిస్టు చేస్తున్నట్లు అందులో మార్పు చోటుచేసుకుంది.

మార్పునకు కారణాలేమిటో?

ఏపీ ప్రభుత్వ ఎస్‌ఎల్‌పీని జస్టిస్‌ లావు నాగేశ్వరరావు ధర్మాసనం నుంచి జస్టిస్‌ సంజయ్‌ కిషన్‌ కౌల్‌ ధర్మాసనానికి మార్చడానికి కారణాలేంటన్నది అధికారికంగా తెలియదు. ఉద్యోగుల సంఘం తరఫున కేసును డ్రాఫ్ట్‌ చేసిన న్యాయవాది ఒకరు తాను గతంలో జస్టిస్‌ లావు నాగేశ్వరరావు న్యాయవాదిగా ఉన్నప్పుడు ఆయన వద్ద జూనియర్‌గా పని చేశానని, ఈ కేసు ఆ బెంచ్‌ ముందుకెళ్తే ఆయన నాట్‌ బిఫోర్‌ మీ అనే అవకాశం ఉన్నందున వేరే ధర్మాసనానికి బదిలీ చేయాలని సుప్రీంకోర్టు రిజిస్ట్రీకి విజ్ఞప్తి చేయడంవల్లే మార్పు చోటుచేసుకున్నట్లు న్యాయవాద వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.