హెచ్డీఎఫ్సీ బ్యాంకు రెండేళ్ల పాటు మీ సేవా ద్వారా సేవలు అందించనుంది. ఈ మేరకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకుంది. ఇవాళ మీ సేవా కమిషనర్ జీటీ వెంకటేశ్వరరావు, హెచ్డీఎఫ్సీ తెలంగాణ ఇన్ఛార్జి భద్రి విశాల్ మధ్య ఈ ఒప్పందం జరిగింది. రాష్ట్రంలోని 110 మీ సేవా కేంద్రాలకు చెందిన నగదు, నగదు రహిత సేవలు అందించనున్నారు.
రోజూ లక్షన్నర వరకు మీ సేవా కేంద్రాల ద్వారా లావాదేవీలు కమిషనర్ జీటీ వెంకటేశ్వరరావు తెలిపారు. ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో ఉన్నందున బాధ్యతగా పనిచేయాల్సి ఉంటుందన్నారు. రోజుకు రూ.350 కోట్ల విలువైన లావాదేవీలు జరుగుతున్నాయన్నారు. రాష్ట్రంలో 221 బ్యాంకు శాఖలు, 1010 ఏటీఎంల ద్వారా ఖాతాదారులకు మెరుగైన సేవలు అందిస్తున్నట్లు హెచ్డీఎఫ్సీ తెలంగాణ ఇన్ఛార్జి భద్రి విశాల్ అన్నారు.
ఇవీ చూడండి: ఎమ్మెల్సీని అడ్డుకున్న టోల్ సిబ్బంది... గేట్ వద్దే బైఠాయించిన నేత