ETV Bharat / bharat

సర్కారీ బడి విద్యార్థుల ఫ్లైట్ జర్నీ- సొంత ఖర్చులతో టూర్​కు​ తీసుకెళ్లిన టీచర్ - TEACHER TOOK STUDENTS IN PLANE

పాఠశాలలో హాజరు పెంచడం కోసం విద్యార్థులకు విమానంలో విహారయాత్ర- పిల్లలను హైదరాబాద్​ సందర్శనకు తీసుకొచ్చిన టీచర్​ ప్రకాశ్​ దేయన్నవర- టూర్​ కోసం రూ.2లక్షలు సొంతంగా ఖర్చు చేసిన ఉపాధ్యాయుడు​

Teacher Took Students On Trip By Plane
Teacher Took Students On Trip By Plane (ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : Nov 8, 2024, 4:19 PM IST

Teacher Took Students On Trip By Plane : పాఠశాలలో విద్యార్థుల హాజరు శాతం పెంచేందుకు ఓ ఉపాధ్యాయుడు వినూత్న ఆలోచన చేశారు. కొంతమంది పిల్లలను విమానంలో విహరయాత్రకు హైదరాబాద్​కు తీసుకొచ్చారు. ఈ టూర్​ కోసం అయిన ఖర్చును సొంతంగా భరించారు. అసలు ఈ టీచర్ ఎవరు, ఆయనకు ఈ ఆలోచన ఎలా వచ్చిందో ఇప్పుడు తెలుసుకుందాం.

Teacher Took Students On Trip By Plane
సొనట్టి ప్రభుత్వ సీనియర్ ప్రైమరీ పాఠశాల (ETV Bharat)

కర్ణాటక బెళగావి మండలంలోని సొనట్టి ప్రభుత్వ సీనియర్ ప్రైమరీ పాఠశాలలో ప్రకాశ్​ దెయన్నవర ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో చదువు పట్ల సరైన అవగాహన లేదని, దాని గురించి స్థానికులు ఎక్కువగా పట్టించుకోవడం లేదని గుర్తించారు. అందుకే పాఠశాలల్లో పిల్లల హాజరు సంఖ్య తక్కువగా ఉందని తెలుసుకున్నారు. అయితే ఈ పరిస్థితిని మార్చి, పాఠశాలకు పిల్లలు రెగ్యులర్​గా వచ్చేలా చేయాలని అనుకున్నారు ప్రకాశ్. అనుకున్నదే తడవుగా ఆయన ఆలోచనను ఆచరణలో పెట్టారు. స్కూల్​కు క్రమం తప్పకుండా వచ్చిన వారిని విమానంలో విహారయాత్రకు తీసుకెళ్తానని ప్రకటన చేశారు.

Teacher Took Students On Trip By Plane
ఉపాధ్యాయుడు ప్రకాశ్​ దెయన్నవర (ETV Bharat)

ప్రకాశ్​ ఆలోచన పనిచేయడం మొదలు పెట్టింది. ఆయన చేసిన ప్రకటనతో విద్యార్థుల్లో విమానంలో విహరించాలనే తపన ఏర్పడింది. క్రమంగా పిల్లల హాజరు శాతం కూడా పెరిగింది. దీంతో మాట ఇచ్చినట్టుగా ఏడాది తర్వాత పాఠశాలకు రెగ్యులర్​గా వచ్చిన 17 మంది విద్యార్థులను ఎంపిక చేశారు. వారందరినీ గురువారం(నవంబర్ 7న) బెళగావి సాంబ్రా విమానాశ్రయం నుంచి హైదరాబాద్​కు తీసుకొచ్చారు ప్రకాశ్. విమానాశ్రయంలో తల్లిదండ్రులు పిల్లలకు ఆనందంగా వీడ్కోలు పలికారు.
విద్యార్థులంతా రెండు రోజుల పాటు హైదరాబాద్​ను సందర్శిస్తారు. ఇక్కడ ప్రముఖ పర్యటక ప్రాంతాలైన రామోజీ ఫిల్మ్​సిటీ, చార్మినార్, గోల్కొండ, సాలార్​ జంగ్ మ్యూజియం తదితర ప్రాంతాలను చూస్తారు.

Teacher Took Students On Trip By Plane
విమానంలో విహారయాత్రకు వెళ్లిన విద్యార్థులు (ETV Bharat)

సొంత ఖర్చుతో!
ఈ విహారయాత్రకు సంబంధించి మొత్తం దాదాపు రూ.2.5లక్షలు ఖర్చు అవుతుందని అంచనా. అందులో రూ.2లక్షల వరకు ప్రకాశ్​ దెయన్నవర భరిస్తున్నారు. మిగతా మొత్తం కోసం రూ.3 వేల చొప్పున పిల్లల నుంచి వసూలు చేశారు.

ఆనందంలో విద్యార్థులు

"నేను ఆకాశంలో విమానం ఎగరడం చూశాను. విమానంలో ప్రయాణించాలనేది నా కోరిక. ప్రకాశ్​ సర్​ వల్ల ఆ కోరిక నెరవేరింది. నాకు చాలా సంతోషంగా ఉంది. నేను స్కూల్​కు ఒక్క రోజు కూడా గైర్హాజరు కాలేదు. అందుకే నాకు ఈ అవకాశం​ వచ్చింది."
-- సంస్కృతి, విద్యార్థిని

"మా ఊళ్లో ఎవరూ విమానం ఎక్కలేదు. ఈ అవకాశం వచ్చినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. ప్రకాశ్​ సర్​కు నా ధన్యవాదాలు. ఈ టూర్​ అయిపోయాక కూడా నేను రెగ్యులర్​గా స్కూల్​కు వెళతాను. "
-- శివప్రసాద్, విద్యార్థి

"ఈ విహారయాత్ర విజయవంతంగా పూర్తి కావాలని కోసం ప్రకాశ్​ దేయన్నవర గత ఏడాది కాలంగా కష్టపడుతున్నారు. తన కుటుంబంలో ఆర్థిక ఇబ్బందులు ఉన్నా విద్యార్థుల యాత్ర కోసం రూ.2లక్షలు కేటాయించారు. ఈ విహారయాత్ర ద్వారా పిల్లలకు మరిచిపోలేని అనుభవాన్ని అందిస్తున్నారు. ఐదేళ్ల క్రితం వరకు సోనట్టి స్కూల్​ చాలా వెనుకబడి ఉండేది. కానీ ప్రకాశ్​ కృషి​ వల్ల ఇప్పుడు మెరుగుపడింది. ప్రభుత్వ పాఠశాలలను మెరుగుపరడంలో వ్యాపారులు కూడా ముందుండాలి."
--రమేశ్​ గోని, ఉపాధ్యాయుడు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.