ETV Bharat / city

Hc On Hcu Lands: 'నాలుగు ఎకరాలపై యథాతథస్థితి కొనసాగించండి' - తెలంగాణ హైకోర్టు తాజా వార్తలు

హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయానికి సంబంధించిన భూవివాదంపై హైకోర్టులో విచారణ జరిగింది. యూనివర్సిటి స్థలంలో దానికి తెలియకుండా 25.16 ఎకరాలను ప్రైవేటుకు కేటాయిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జీవో జారీ వివాదంపై హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది.

Hc On Hcu Lands
Hc On Hcu Lands
author img

By

Published : Sep 9, 2021, 4:52 AM IST

హైదరాబాద్‌ కేంద్రీయ విశ్వవిద్యాలయానికి కేటాయించిన స్థలంలో దానికి తెలియకుండా 25 ఎకరాలను ప్రైవేటు వ్యక్తులకు కేటాయిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జీవో జారీ వివాదంపై హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. విశ్వవిద్యాలయంతో ఘర్షణ వైఖరి ఎందుకని ప్రశ్నించింది. గోపన్నపల్లిలో ఉన్న సర్వే నం.37లోని 4.31 ఎకరాల భూములపై యథాతథస్థితిని కొనసాగించాలంటూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. 25 ఎకరాలను ప్రైవేటు వ్యక్తులకు కేటాయిస్తూ ప్రభుత్వం జీవో జారీ చేయడాన్ని సమర్థిస్తూ సింగిల్‌ జడ్జి ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ యూనివర్సిటీ దాఖలు చేసిన అప్పీలుపై బుధవారం తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎం.ఎస్‌.రామచంద్రరావు, జస్టిస్‌ టి.వినోద్‌కుమార్‌లతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. ఈ భూమిలో 21 ఎకరాలను అప్పగించడానికి యూనివర్సిటీ అంగీకరించిన నేపథ్యంలో కేవలం 4 ఎకరాల వివాదంపై విచారణ చేపడతామని పేర్కొంది. రాష్ట్ర ప్రభుత్వంతోపాటు ప్రైవేటు వ్యక్తులకు నోటీసులు జారీ చేసింది. విచారణను నవంబరుకు వాయిదా వేసింది.

సెంట్రల్‌ యూనివర్సిటీకి కేటాయించిన 2,300 ఎకరాల్లో ప్రైవేటు వ్యక్తులకు చెందిన 25 ఎకరాలకు పైగా ఉండటంతో కోర్టు ఉత్తర్వుల ప్రకారం వారికి అప్పగించాల్సి వచ్చింది. ప్రత్యామ్నాయంగా గోపన్నపల్లి వైపు ఉన్న 21 ఎకరాలను ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని, దీనికి ప్రైవేటు వ్యక్తులు కూడా అంగీకరించినందున అనుమతించాలని యూనివర్సిటీ ప్రభుత్వాన్ని కోరింది. అయితే దానిపై ఎలాంటి నిర్ణయం తీసుకోకుండా, యూనివర్సిటీని సంప్రదించకుండా 2008లో గోపన్నపల్లిలోని 25.31 ఎకరాలను ప్రైవేటు వ్యక్తులకు కేటాయిస్తూ ప్రభుత్వం జీవో జారీ చేసింది. దీనిని సవాలు చేస్తూ యూనివర్సిటీ హైకోర్టును ఆశ్రయించింది. యూనివర్సిటీ 21 ఎకరాలను ఇవ్వడానికి అంగీకరించిన నేపథ్యంలో సింగిల్‌ జడ్జి యూనివర్సిటీ పిటిషన్‌ను కొట్టివేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. సింగిల్‌ జడ్జి ఉత్తర్వులను సవాలు చేస్తూ యూనివర్సిటీ దాఖలు చేసిన అప్పీలుపై విచారించిన ధర్మాసనం బుధవారం ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది.

ఇవీ చూడండి: TS HIGH COURT: 'ప్రణాళికలు, ప్రక్రియల కోసం వైరస్ వేచి చూడదు'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.