అలయ్ - బలయ్ కార్యక్రమాన్ని ఈ నెల 17న హైదరాబాద్ జలవిహార్‌లో నిర్వహిస్తామని నిర్వాహకులు బండారు విజయలక్ష్మి వెల్లడించారు. హరియాణా గవర్నర్, భాజపా సీనియర్ నేత బండారు దత్తాత్రేయ ఆధ్వర్యంలో ఏటా అలయ్ - బలయ్ జరిగేది. ఈసారి దత్తాత్రేయ కుమార్తె విజయలక్ష్మి నేతృత్వంలో నిర్వహిస్తున్నారు. ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయడు, తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, గవర్నర్లు సహా ప్రముఖులకు ఆహ్వానాలు పంపినట్లు తెలిపారు. కులమతాలకు అతీతంగా, తెలంగాణ సాంస్కృతి సాంప్రదాయాలు ఉట్టిపడేలా అలయ్-బలయ్ జరుపుతామంటున్న బండారు విజయలక్ష్మితో ఈటీవీ భారత్ ప్రతినిధి ముఖాముఖి..
ఇదీచూడండి: Dussehra Sharan Navaratri 2021: మహాలక్ష్మి అలంకారంలో అమ్మవారి దర్శనం