ETV Bharat / city

నెలాఖారుకల్లా ఈ దఫా హరితహారం పూర్తవ్వాలి : ఇంద్రకరణ్ రెడ్డి

author img

By

Published : Aug 6, 2020, 7:44 PM IST

Updated : Aug 6, 2020, 10:49 PM IST

హైదరాబాద్​లోని అరణ్య భవన్​లో హరితహారం ప్రగతిపై కలెక్టర్లతో దృశ్యమాధ్యమ సమీక్ష నిర్వహించిన మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి... ఈ నెలాఖారులోగా ప్రస్తుత దఫా హరితహారం పూర్తి చేయాలని ఆదేశించారు.

నెలఖారుకల్లా ఈ దఫా హరితహారం పూర్తవ్వాలి : ఇంద్రకరణ్ రెడ్డి

హైదరాబాద్ సైఫాబాద్​లోని అరణ్య భవన్​లో హరితహారం ప్రగతిపై జిల్లా కలెక్టర్లతో అటవీ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి దృశ్యమాధ్యమ సమీక్ష నిర్వహించారు. నెలాఖరుకల్లా ఈ దఫా హరితహారం లక్ష్యాన్ని పూర్తి చేయాలని మంత్రి స్పష్టం చేశారు. అధికారులు చిత్తశుద్ధితో కార్యక్రమాలను అమలు చేస్తూ... ల‌క్ష్యాన్ని చేరుకోవాలని సూచించారు. హ‌రిత‌హారం కార్యక్రమంతో మంచి ఫ‌లితాలు క‌నిపిస్తున్నాయని, పచ్చ‌ద‌నం పెర‌గ‌డం వల్ల అంద‌రూ హ‌ర్షిస్తున్నారని పేర్కొన్నారు. ఈ ఏడాదికి నిర్ధేశించిన 29.86 కోట్ల‌ లక్ష్యానికి గాను ఇప్పటి వరకు 65 శాతంతో 19.58 కోట్లు మొక్కలు నాటినట్లు తెలిపారు.

జియోట్యాగింగ్ తప్పనిసరి...

నాటే ప్రతి మొక్క ఎదిగేలా సంరక్షణ చర్యలు తీసుకోవాలని, కచ్చితంగా జియోట్యాగింగ్‌ పూర్తి చేయాలని మంత్రి స్పష్టం చేశారు. రానున్న రెండేళ్ళ‌కు గాను క్యాలెండ‌ర్ ఇయ‌ర్ ప్లాన్​ను రూపొందించుకుని, న‌ర్స‌రీల్లో ఎత్తైన మొక్క‌ల‌ను పెంచాలని సూచించారు. స‌ర్పంచ్​లు, ఇత‌ర ప్ర‌జాప్ర‌తినిధులు ప్ర‌కృతి వ‌నాల ఏర్పాటును స‌వాల్​గా తీసుకుని అభివృద్ది చేస్తున్నారని వెల్లడించారు.

పల్లె వనాలు...స్మృతి వనాలు సైతం

ప‌ల్లె వనాలు, స్మృతి వ‌నాలు సైతం ఏర్పాటు చేసుకోవాలన్నారు. సీఎం కేసీఆర్ ఆలోచనలకు అనుగుణంగా ప‌ట్ట‌ణ ప్రాంతాల్లో ప‌చ్చ‌ద‌నం పెంచేలా ప్ర‌ణాళిక‌లు రూపొందించుకోవాలని కోరారు. నాటిన మొక్క‌ల్లో 85% మొక్క‌లు బ‌త‌కాల్సిందేనని, ఎలాంటి మినయింపులు లేవని స్పష్టం చేశారు. లెక్క‌ల కోసం కాకుండా నాటిన మొక్క‌లన్నీ పెరిగి ప‌చ్చ‌ద‌నం క‌నిపించేలా అధికారులు ప‌ని చేయాలని ఆదేశించారు.

ఇవీ చూడండి : కరోనా బాధితుల్లో ధైర్యం నింపేలా కలెక్టర్లు చర్యలు తీసుకోవాలి: ఈటల

Last Updated : Aug 6, 2020, 10:49 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.