ETV Bharat / city

ఆకుపచ్చ తెలంగాణే లక్ష్యంగా.. గ్రేటర్​లో హరిత సంబురం

రాష్ట్రంలో ఆరో విడత హరితహారం కార్యక్రమం అట్టహాసంగా ప్రారంభమైంది. ఆకుపచ్చ తెలంగాణే లక్ష్యంగా చేపట్టిన ఈ మహాక్రతువులో.. ప్రజాప్రతినిధులతోపాటు ప్రజలు భాగస్వాములయ్యారు. ఎక్కడికక్కడ మొక్కలు నాటిన మంత్రులు...హరితహరాన్ని విజయవంతం చేయాలని కోరారు.

HARITHA HARAM PROGRAM IN GREATER HYDERABAD
ఆకుపచ్చ తెలంగాణే లక్ష్యంగా.. గ్రేటర్​లో హరితసంబురం
author img

By

Published : Jun 25, 2020, 10:05 PM IST

రాష్ట్రంలో అడవుల విస్తీర్ణాన్ని పెంచి... హరిత తెలంగాణను సాకారం చేయాలన్న లక్ష్యంతో ఆరోవిడత మొక్కల పండుగ సందడిగా మొదలైంది. హైదరాబాద్‌లోని బల్కంపేట, దుండిగల్‌లో మంత్రి కేటీఆర్‌ మొక్కనాటారు. తెలంగాణను హరిత శోభితం చేయడమే లక్ష్యమన్న పురపాలక మంత్రి కేటీఆర్‌..భవిష్యత్ తరాలకు మెరుగైన పట్టణాలు అందించేందుకు.. హరితహారాన్ని విజయవంతం చేయాలని కోరారు.

హరిత శోభితం

రాష్ట్రం పచ్చగా ఉండాలంటే... సీఎం ఆశయం నెరవేరాలని హోంమంత్రి మహమూద్‌ అలీ అన్నారు. హైదరాబాద్ గోషామహల్ స్టేడియంలో హరితహారం కార్యక్రమంలో పాల్గొన్న హోంమంత్రి.. అన్ని గ్రామాల్లో పెద్దఎత్తున మొక్కలు నాటాలని విజ్ఞప్తి చేశారు. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం, ఇబ్రహీంపట్నం నియోజకవర్గాల్లో... విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి హరితహారం కార్యక్రమాల్లో పాల్గొన్నారు. మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం ముదిగుంటలోని 20 హెక్టార్ల హరితవనంలో మంత్రి కొప్పుల ఈశ్వర్‌ మొక్కలు నాటారు. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి... అడవుల విస్తీర్ణానికి తోడ్పాడాలని మంత్రులు విజ్ఞప్తి చేశారు.

గ్రేటర్​ పరిధిలో...

లాలాపేటలో ఉప సభాపతి పద్మారావుగౌడ్, ఆటోనగర్‌లోని హరిణ వనస్థలిలో ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి మొక్కలు నాటారు. హైదర్‌నగర్‌లో నిర్వహించిన హరితహారం కార్యక్రమంలో శేర్‌లింగంపల్లి ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ, జోనల్ కమిషనర్ మమత పాల్గొనగా.. ముషీరాబాద్‌ పరిధిలో శాసనసభ్యులు ముఠాగోపాల్ మొక్కనాటారు. వికారాబాద్ జిల్లా గోదంగూడ గ్రామంలో ఎమ్మెల్యే మెతుకు ఆనంద్‌, ఎమ్మెల్సీ మహేందర్‌రెడ్డి మొక్కలు నాటారు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్‌లో ఎమ్మెల్యే మాణిక్యరావు, ఎమ్మెల్సీ ఫరీదుద్దీన్ హరితహారాన్ని ప్రారంభించారు. దుబ్బాకలో ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి హరితహారానికి శ్రీకారం చుట్టారు.

ఇవీ చూడండి: హరితహారంలో కేసీఆర్​.. నర్సాపూర్​ అర్బన్ ఫారెస్ట్​ ప్రారంభించిన సీఎం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.