MLA Kakani Govardhan Reddy: ఏపీ ముఖ్యమంత్రి జగన్ కొత్త టీమ్ రెడీ అయ్యింది. రెండు రోజుల నుంచి కసరత్తు చేసిన ముఖ్యమంత్రి.. మంత్రుల పేర్లను ఖరారు చేసినట్లు తెలుస్తోంది. ఈ జాబితాను కాసేపట్లో గవర్నర్‌కు పంపించనున్నారు. ఇదిలావుంటే.. నెల్లూరులోని సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాని గోవర్థన్‌రెడ్డి ఇంటి వద్ద సందడి వాతావరణం నెలకొంది. మంత్రుల జాబితాలో కాకాని పేరు ఉందనే సమాచారంతో.. అభిమానులు బొకేలు, స్వీట్లతో ఆయన ఇంటికి తరలి వచ్చారు. కాసేపట్లో కాకాని గోవర్ధన్ రెడ్డికి.. స్వయంగా ముఖ్యమంత్రితో పాటు సీఎంవో కార్యాలయం నుంచి సమాచారం వస్తుందని వేచి చూస్తున్నారు.
ప్రచారంలో ఉన్న ప్రకారం పాత మంత్రుల్లో కొనసాగే వారి పేర్లు..!: గుమ్మనూరు జయరాం, ఆదిమూలపు సురేష్, నారాయణస్వామి, తానేటి వనిత, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బొత్స సత్యనారాయణ, శంకర నారాయణ, కొడాలి నాని, కన్నబాబు, బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డిలలో అయిదారుగురికి లేదా ఒత్తిడి ఎక్కువగా ఉంటే ఇంకో ఒకరిద్దరికీ కొత్త మంత్రివర్గంలో అవకాశం ఉండొచ్చంటున్నారు.
ఇదీ చూడండి: AP New ministers List : నేడు ఖరారు కానున్న కొత్త మంత్రుల జాబితా