ETV Bharat / city

చేయి విరిగింది.. అయినా ఒంటి చేత్తో వ్యవసాయం చేస్తాడు - అనంతపురంలో ఒంటిచెత్తో వ్యవసాయం చేస్తున్న రైతు న్యూస్

మా ఇంట్లో పరిస్థితులు బాగాలేవు.. ఏం చేయలేకపోతున్నా. ప్రమాదంలో నా కాలు విరిగింది.. మంచానికే పరిమితమయ్యా. ఇలాంటి సమాధానాలన్నీ ఏమీ చేయలేని వాళ్లు చెప్పే మాటలు. ప్రాణంతో ఉన్నాం, ఆలోచించగలుగుతున్నాం.. ఇంతకన్నా ఇంకా ఏం కావాలి? అని ఓ రైతు చెప్పే మాటలు. ఆ రైతు కూడా ఓ ప్రమాదంలో చేయి.. పొగొట్టుకున్నవాడే. అయినా వ్యవసాయం చేస్తున్నాడు.

చేయి విరిగింది.. అయినా ఒంటి చేత్తో వ్యవసాయం చేస్తాడు

author img

By

Published : Aug 8, 2020, 8:01 PM IST

సమస్యలు చుట్టుముట్టినా.. ఆ రైతుకు చీకట్లు కమ్ముకోలేదు. చీకటి అవతల ఉన్న.. వెలుతురును చూశాడు. పరిస్థితులు దివ్యాంగుడిని చేసినా... అదేం పెద్ద సమస్య కాదన్నట్టు.. ఒంటి చేత్తో పొలం దున్నుతాడు. తన పనులు తానే చేసుకుంటాడు.. అనంతపురానికి చెందిన ఓ అన్నదాత.

ఏపీలోని అనంతపురం జిల్లా విడపనకల్ మండలం డొనేకల్లుకు చెందిన రైతు నబీరసూల్ ఒంటిచెత్తో పొలం దున్నుతాడు. అంగవైకల్యంలోనే అవకాశాన్ని సృష్టించుకున్నాడు. రసూల్ జీవితంలో అన్ని సక్రమంగా జరుగుతున్న సమయంలో ఓ ప్రమాదం జరిగింది. తనకు జీవనోపాధినిచ్చే.. పిండి మిషన్​లో అనుకోకుండా తన కుడిచేయి ఇరుక్కుని.. తెగిపోయింది. అయినా కుంగిపోలేదు. ఒక్క చెయితోనే అద్భుతంగా వ్యవసాయం చేస్తున్నాడు. అన్ని పనులు తానే చేసుకుంటున్నాడు.

తనకున్న ద్విచక్ర వాహనాన్ని.. వ్యవసాయానికి అనుకూలంగా మార్చుకున్నాడు. ఇక దానితోనే.. పొలంలో దున్నుతున్నాడు. చుట్టుపక్కల రైతులతో శభాష్ అనిపించుకుంటున్నాడు రసూల్. ఏదైనా చేయాలనే పట్టుదల ఉంటే.. అంగవైకల్యం ఉన్నా చేయోచ్చని నిరూపిస్తున్నాడు.

చేయి విరిగింది.. అయినా ఒంటి చేత్తో వ్యవసాయం చేస్తాడు

ఇదీ చదవండి: సీఆర్డీఏపై హైకోర్టు స్టే వెకేట్​ చేయాలని సుప్రీంలో ప్రభుత్వం పిటిషన్‌

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.