Half Day Schools in AP : వేసవి ఉష్ణోగ్రతల దృష్ట్యా ఆంధ్రప్రదేశ్లో ఈ రోజు నుంచి ఒంటి పూట బడులు నిర్వహించాలని పాఠశాల విద్యాశాఖ కమిషనర్ ఎస్. సురేష్ కుమార్ ఆదేశాలు జారీ చేశారు. ప్రాథమిక, ఉన్నత పాఠశాలల్లో ఒకటి నుంచి తొమ్మిదో తరగతి వరకు ఉదయం 7.30 గంటల నుంచి 11.30 గంటల వరకు తరగతులు నిర్వ హించాలని పేర్కొన్నారు. మధ్యాహ్న భోజనం అనంతరం విద్యార్థులను ఇంటికి పంపాలని స్పష్టం చేశారు. ఈ నెల 27 నుంచి పదో తరగతి పరీక్షలు ఉన్నందున పాఠశాల విద్యాశాఖ ప్రాంతీయ సంయుక్త సంచాలకులు, జిల్లా విద్యాశాఖాధికారి ప్రణాళిక ప్రకారం విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహించాలని సూచించారు.
Half Day Schools in AP: నేటి నుంచే ఒంటి పూట బడులు.. వారికి ప్రత్యేక తరగతులు - ఏపీలో ఒంటిపూట బడుల వార్తలు
Half Day Schools in AP : వేసవి తీవ్రత దృష్ట్యా ఏపీలో నేటి నుంచి ఒంటి పూట బడులు నిర్వహించాలని పాఠశాల విద్యాశాఖ కమిషనర్ ఆదేశాలు జారీ చేశారు. ఒకటి నుంచి తొమ్మిదో తరగతి వరకు ఉదయం 7.30 గంటల నుంచి 11.30 గంటల వరకు తరగతులు నిర్వహించాలని పేర్కొన్నారు.