ETV Bharat / city

Duggirala Case: 'అత్యాచారం జరగలేదు... వివాహేతర సంబంధమే కారణం' - duggirala murder case updates

Duggirala Case: ఏపీ గుంటూరు జిల్లా దుగ్గిరాలలో హత్యాచార ఘటనపై గుంటూరు అర్భన్​ ఎస్పీ స్పందించారు. సదరు మహిళపై అసలు అత్యాచారమే జరగలేదని.. వివాహేతర సంబంధమే హత్యకు దారితీసిందని ఎస్పీ వెల్లడించారు. శాస్త్రీయ ఆధారాల ద్వారా దర్యాప్తు చేస్తున్నామన్న ఎస్పీ.. ఈ కేసులో ఇద్దరు అనుమానితులను అదుపులోకి తీసుకున్నట్లు చెప్పారు.

Duggirala Case
Duggirala Case
author img

By

Published : Apr 28, 2022, 8:34 PM IST

Duggirala Case: ఏపీ గుంటూరు జిల్లా దుగ్గిరాల మండలం తుమ్మపూడిలో మహిళపై హత్యాచార ఘటన స్థానికంగా కలకలం రేపిన విషయం తెలిసిందే. ఆ కేసును ఛేదించిన పోలీసులు.. అసలు ఈ ఘటనలో అత్యాచారమే జరగలేదని తేల్చారు. బాధిత మహిళకు ఓ వ్యక్తితో ఉన్న వివాహేతర సంబంధమే హత్యకు దారితీసిందని గుంటూరు అర్బన్‌ ఎస్పీ ఆరిఫ్‌ హఫీజ్ తెలిపారు. మహిళను హత్య చేసిన నిందితుడు శివసత్య సాయిరాంతో పాటు ఆమెతో వివాహేతర సంబంధం ఉన్న వెంకట సాయి సతీష్‌ను అరెస్టు చేసినట్లు ఎస్పీ చెప్పారు. ఈ మేరకు ఈ కేసుకు సంబంధించిన వివరాలను ఎస్పీ మీడియాకు వెల్లడించారు.

'అత్యాచారం జరగలేదు... వివాహేతర సంబంధమే కారణం'

‘హతురాలి ఇంటికి వెంకట సాయి సతీష్‌, అతని స్నేహితుడుశివసత్య సాయిరాం వెళ్లాడు. తన కోరిక తీర్చాలని శివసత్య సాయిరాం మహిళను వేధించాడు. అయినప్పటికీ ఆమె నిరాకరించింది. ఈ విషయం గురించి అందరికీ చెబుతానని హతురాలు బెదిరించడంతో ఆమె చీరనే మెడకు బిగించి హత్య చేశాడు’అని ఎస్పీ వివరించారు. ఈ ఘటన సామూహిక అత్యాచారం కాదని.. ఘటనలో ఎలాంటి రాజకీయ కోణం కూడా లేదని ఎస్పీ స్పష్టం చేశారు. 24 గంటల్లోనే కేసును ఛేదించిన పోలీసులను ఎస్పీ అభినందించారు.

అసలేం జరిగింది : బుధవారం మధ్యాహ్నం 2.30 గంటల సమయంలో తిరుపతమ్మ బంధువైన ఓ యువకుడు ఆమెను కలవడానికి ఇంటికి వెళ్లాడు. ఆమె ఒంటిపై దుస్తులు సక్రమంగా లేకుండా అచేతనంగా పడి ఉండటం గమనించి పోలీసులు, 108 సిబ్బందికి సమాచారం అందించారు. తిరుపతమ్మకు పదిహేనేళ్ల కిందట శ్రీనివాసరావు అనే వ్యక్తితో వివాహమైంది. వీరికి కుమార్తె, కుమారుడు ఉన్నారు. పొలాలకు నీళ్లు పెట్టే ట్యూబులు అద్దెకు ఇస్తూ జీవనం సాగిస్తున్నారు. శ్రీనివాసరావు పనుల కోసం గ్రామం విడిచి వెళుతుంటాడు. ఒకసారి వెళ్తే ఐదు, ఆరు నెలలు ఇంటికి రారు.

గతేడాది డిసెంబరులో ఆయన పనులు కోసం ఇంటి నుంచి వెళ్లారు. మృతురాలి ఇంటి తలుపులు తెరిచి ఉండడం.. ఆమె చెవి రింగులు పక్కనే పడిపోవడం.. గొంతుపై గట్టిగా నులిమినట్లు గుర్తులున్నట్లు పోలీసులు గుర్తించారు. మృతురాలి భర్తను ఫోన్ ద్వారా సంప్రదించగా ఆయన రైల్వేశాఖలో ఎలక్ట్రికల్ పనులు కోసం వెళ్లానని ప్రస్తుతం తిరుపతిలో ఉన్నట్లు చెప్పారు. తాను వెంటనే గ్రామానికి బయల్దేరి వస్తున్నానని, మృతిపై అనుమానాలు ఉన్నాయన్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు 24 గంటలలోపే నిందితులను పట్టుకొని కేసును ఛేదించారు.

ఇవీ చదవండి: మహిళపై హత్యాచారం.. పోలీసుల అదుపులో అనుమానితులు

అప్పులు చెల్లించలేక భార్యను అప్పగించిన భర్త!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.