ETV Bharat / city

అలా చేసినట్టు తేలితే ఏపీ సీఎస్​ జైలుకే.. ట్రైబ్యునల్​ స్పష్టం..! - telangana on Rayalaseema Upliftment Scheme

ఎన్జీటీకి ఇచ్చిన హామీకి విరుద్ధంగా రాయలసీమ ఎత్తిపోతల పథకం పనులను ఏపీ ప్రభుత్వం కొనసాగిస్తోందని, కోర్టు ధిక్కరణ కింద చర్యలు తీసుకోవాలని కోరుతూ దాఖలైన పిటిషన్​పై ధర్మాసనం విచారణ చేపట్టింది. కోర్టు ధిక్కరణకు పాల్పడినట్లు రుజువైతే హామీ ఇచ్చిన ఆ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్‌)ని ప్రాసిక్యూట్‌ చేసి జైలుకు పంపగలమని, ఎవరు ఉత్తర్వులు ఉల్లంఘించినా ఇది తప్పదని పేర్కొంది.

Green Tribunal hearing on Rayalaseema Upliftment Scheme

author img

By

Published : Jun 26, 2021, 5:49 AM IST

రాయలసీమ ఎత్తిపోతల పథకానికి సంబంధించి ఇచ్చిన హామీని ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని జాతీయ హరిత ట్రైబ్యునల్‌ (ఎన్జీటీ, చెన్నై) ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వానికి స్పష్టం చేసింది. కోర్టు ధిక్కరణకు పాల్పడినట్లు రుజువైతే హామీ ఇచ్చిన ఆ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్‌)ని ప్రాసిక్యూట్‌ చేసి జైలుకు పంపగలమని, ఎవరు ఉత్తర్వులు ఉల్లంఘించినా ఇది తప్పదని పేర్కొంది. ఎత్తిపోతల పనులపై తాజా నివేదిక సమర్పించాలంటూ ప్రాంతీయ అటవీ పర్యావరణ శాఖ (బెంగళూరు)కు, కృష్ణా బోర్డుకు ఆదేశాలు జారీ చేసింది.

కోర్టు ధిక్కరణ పిటిషన్‌పై పూర్తి వివరాలతో కౌంటరు దాఖలు చేయాలని ఏపీని ఆదేశిస్తూ విచారణను జులై 12కి వాయిదా వేసింది. ఎన్జీటీకి ఇచ్చిన హామీకి విరుద్ధంగా రాయలసీమ ఎత్తిపోతల పథకం పనులను ఏపీ ప్రభుత్వం కొనసాగిస్తోందని, కోర్టు ధిక్కరణ కింద చర్యలు తీసుకోవాలని కోరుతూ జి.శ్రీనివాస్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిపై శుక్రవారం ఎన్జీటీ జ్యుడిషియల్‌ సభ్యులు జస్టిస్‌ రామకృష్ణన్‌, సాంకేతిక సభ్యులు సత్యగోపాల్‌తో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది.

పిటిషనర్‌ తరఫు న్యాయవాది కె.శ్రవణ్‌కుమార్‌ వాదనలు వినిపిస్తూ శ్రీశైలం నుంచి రోజుకు మూడు టీఎంసీల నీటిని తరలించేందుకు వీలుగా చేపట్టిన రాయలసీమ ఎత్తిపోతల పథకం పనులను అనుమతుల్లేకుండా చేపట్టబోమని ఏప్రిల్‌ 22న ఏపీ ప్రభుత్వం హామీ ఇచ్చిందన్నారు. దీనికి విరుద్ధంగా పర్యావరణ అనుమతుల్లేకుండా పనులను కొనసాగిస్తోందని చెప్పారు. హామీని ఉల్లంఘించిన ఆ రాష్ట్ర సీఎస్‌పై కోర్టు ధిక్కరణ చర్యలు చేపట్టాలని కోరారు. సీనియర్‌ న్యాయవాది వాదనలు వినిపించడానికి 10 రోజుల గడువు కావాలని ఏపీ తరఫు న్యాయవాది దొంతి మాధురిరెడ్డి కోరారు. గత హామీకి కట్టుబడి ఉన్నామన్నారు. డీపీఆర్‌ కోసం ప్రాథమిక పనులు మాత్రమే చేస్తున్నామన్నారు. పర్యావరణ అనుమతుల కోసం దరఖాస్తు చేశామని చెప్పారు. ప్రాజెక్టు పనులను చేపట్టలేదని స్పష్టం చేశారు.

తెలంగాణ తరఫున అదనపు అడ్వొకేట్‌ జనరల్‌ జె.రామచంద్రరావు వాదనలు వినిపిస్తూ ప్రాజెక్టు ఇన్వెస్టిగేషన్‌ పేరుతో ప్రధాన ప్రాజెక్టు పనులు చేపడుతోందన్నారు. డీపీఆర్‌ కోసం ప్రాథమికంగా పనులు చేస్తున్నామంటూ ప్రాజెక్టు ప్రధాన పనులనే చేపట్టిందన్నారు.వెయ్యి దాకా టిప్పర్లు, హిటాచీలు పనిచేస్తున్నాయన్నారు. కేంద్రంతోపాటు, తెలంగాణ ప్రభుత్వాన్నీ ఏపీ తప్పుదోవ పట్టిస్తోందని తెలిపారు. ఎన్జీటీ ఆదేశాల మేరకు పనుల తనిఖీకి కృష్ణా బోర్డుకు ఏపీ ప్రభుత్వం సహకరించడం లేదన్నారు. ఇందులో ప్రభుత్వం తరఫునా కోర్టు ధిక్కరణ పిటిషన్‌ వేశామన్నారు.

ఈ దశలో ధర్మాసనం జోక్యం చేసుకుంటూ ఈ పిటిషన్‌లో ఏపీ కౌంటరు దాఖలు చేశాక చూద్దామంది. ఒకవేళ ప్రధాన ప్రాజెక్టు పనులు చేపట్టినట్లు తేలితే సీఎస్‌ను జైలుకు పంపగలమని స్పష్టం చేసింది. కోర్టు ధిక్కరణ పిటిషన్‌లో ·కౌంటరు దాఖలు చేయాలని ఏపీని ఆదేశించింది. పనులపై తాజా నివేదికను సమర్పించాలంటూ బెంగళూరులోని అటవీ పర్యావరణ ప్రాంతీయశాఖను ఆదేశిస్తూ విచారణను జులై 12కి వాయిదా వేసింది.

ఇదీ చూడండి: Vaccination: రాష్ట్రంలో కోటి మార్క్‌ దాటిన కరోనా టీకా పంపిణీ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.