హైదరాబాద్ రవీంద్రభారతిలో తెలంగాణ బహుముఖ సకల కళా సమ్మేళనం ఘనంగా జరిగింది. తెలంగాణ పర్యటక, భాషా సాంస్కృతిక శాఖ సౌజన్యంతో నటరాజ్ అకాడమీ పదో వార్షికోత్సవాన్ని అట్టహాసంగా నిర్వహించారు. గిరిజన సాంప్రదాయ నృత్యాలు, బతుకమ్మ పాటలతో రవీంద్రభారతి ప్రాంగణం సందడిగా మారింది. నేటి తరానికి తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను గుర్తుచేయడం, మరుగున పడిపోతున్న కళలను వెలికి తీసేందుకు ఈ కార్యక్రమం నిర్వహించామన్నారు. ఇందులో సుమారు 450 మంది కళాకారులు ప్రదర్శనలిచ్చారు.
ఇవీ చూడండి: పండగొస్తుంది... ప్రాణాలపైకి తెచ్చుకోకండి