రాష్ట్రంలో రెండు పట్టభద్రుల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. 21 జిల్లాలు, 77 శాసనసభ నియోజకవర్గాల్లోని 1530 పోలింగ్ కేంద్రాల్లో పోలింగ్ జరుగుతోంది. హైదరాబాద్ - రంగారెడ్డి - మహబూబ్ నగర్ నియోజవర్గం నుంచి ఏకంగా 93 మంది, నల్గొండ-వరంగల్- ఖమ్మం నియోజకవర్గం నుంచి 71 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. ఉదయం 8 గంటలకు ప్రారంభమైన పోలింగ్.. సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ కొనసాగనుంది.
ఒక్కో పోలింగ్ కేంద్రంలో ఐదుగురు సిబ్బంది విధులు నిర్వర్తిస్తున్నారు. అభ్యర్థుల సంఖ్య భారీగా ఉన్న నేపథ్యంలో దినపత్రిక పరిమాణంలో ఉన్న బ్యాలెట్ పత్రాల ఉపయోగిస్తున్నారు. అందుకు తగ్గట్లుగా పోలింగ్ కేంద్రానికి ఒకటి చొప్పున జంబో బ్యాలెట్ బాక్సులను.. ఒకట్రెండు పెద్ద బ్యాలెట్ బాక్సులను వినియోగిస్తున్నారు.
ఇవీ చూడండి: రాష్ట్ర ఖజానాకు కాసుల వర్షం కురిపిస్తున్న అబ్కారీ శాఖ