గచ్చిబౌలి నానక్‌రాంగూడ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ప్రాంతంలోని భవన నిర్మాణ కార్మికుల అవస్థలు అన్నీఇన్నీ కావు. లాక్‌డౌన్ అమలులోకి వచ్చాక.. దాదాపు వెయ్యి మంది వలస కార్మికులను ప్రభుత్వం ఇక్కడ ఆవాసం కల్పించింది. ఇంత మంది ఒకే చోట ఉన్నప్పటికి ప్రభుత్వం వారిని పట్టించుకోవడం లేదు.
రోజులు గడుస్తున్నప్పటికి తమకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించలేదని వారు చెబుతున్నారు. తమవైపు చూసే నాథుడే కరువయ్యారని వాపోతున్నారు. కనీసం మాస్కులు కూడా అందుబాటలో లేక తమ వద్ద ఉన్న టవళ్లు, చేతి రుమాలే మాస్కులుగా ఉపయోగిస్తున్నామని తెలిపారు. ఉన్న వారిలో ఎవరికి ఆరోగ్య సమస్య వచ్చినా దాని తీవ్రత చాలా ఎక్కువగా ఉంటుందని భయపడుతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం తమను పట్టించుకోవాలని వేడుకుంటున్నారు.
ఇదీ చదవండి: ఎస్‌ఈసీ ఆర్డినెన్స్, జీవోలపై 28న తుది విచారణ