ETV Bharat / city

'శస్త్ర చికిత్స సమయాల్లో ప్రాణాలు కోల్పోవడం బాధాకరం' - 'శస్త్ర చికిత్స సమయాల్లో ప్రాణాలు కోల్పోవడం బాధాకరం'

శస్త్ర చికిత్స సమయాల్లో రక్తం కోల్పోయి ఎంతో మంది మరణిస్తున్నారని గవర్నర్​ ఆవేదన వ్యక్తం చేశారు. రక్తదానం వల్ల ప్రాణాపాయ స్థితిలో ఉన్నవారిని రక్షించవచ్చని తెలిపారు. సయెంట్​, రెడ్​క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహించిన రక్తదాన శిబిరానికి ఆమె హాజరయ్యారు.

Governor tamilisai on blood donation
'శస్త్ర చికిత్స సమయాల్లో ప్రాణాలు కోల్పోవడం బాధాకరం'
author img

By

Published : Feb 20, 2020, 7:52 PM IST

ప్రసవ సమయంలో, ఇతర శస్త్ర చికిత్స సమయాల్లో రక్తం అందక ఎంతో మంది మరణిస్తున్నారని రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ అన్నారు. దీన్ని నివారించాలంటే రక్తదాన శిబిరాలను ప్రోత్సహించాలని పేర్కొన్నారు. హైదరాబాద్, గచ్చిబౌలిలోని సయెంట్​, రెడ్​క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని ఆమె సందర్శించారు. రక్తదానం చేసిన ఉద్యోగులను అభినందించారు.

రెడ్​క్రాస్​ సొసైటీ తెలంగాణ శాఖలో 16 లక్షల మంది సభ్యత్వం కలిగి ఉండటం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. శిబిరంలో దాదాపు 500 మంది ఉద్యోగులు రక్తదానం చేశారు.

'శస్త్ర చికిత్స సమయాల్లో ప్రాణాలు కోల్పోవడం బాధాకరం'

ఇవీ చూడండి: అమ్మకానికి మహవీర్ హరిణ జాతీయ పార్క్​!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.