ETV Bharat / city

రాజ్ భవన్ మహిళలకు చేతి వృత్తుల్లో శిక్షణ

రాజ్​భవన్ మహిళల సెల్ఫ్ ఎంప్లాయిమెంట్​ను గవర్నర్​ తమిళిసై ప్రోత్సహిస్తున్నారు. వివిధ రకాల చేతి వృత్తుల్లో శిక్షణా కార్యక్రమాన్ని చేపట్టారు. కుట్లు, అల్లికలు, ఎంబ్రాయిడరీ, జ్యూట్ బ్యాగుల తయారీ, పేపర్​తో కళాకృతుల తయారీపై శిక్షణ ఇవ్వనున్నారు.

governor tamilisai
governor tamilisai
author img

By

Published : Sep 23, 2020, 6:44 PM IST

రాజ్​భవన్ మహిళల కోసం గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఇప్పటికే రాజ్ భవన్ ఉద్యోగుల ఆరోగ్యం కోసం యోగా సహా పలు కార్యక్రమాలు చేపట్టిన గవర్నర్... ఇప్పుడు సెల్ఫ్ ఎంప్లాయిమెంట్​ను ప్రోత్సహిస్తున్నారు. మహిళలకు వివిధ రకాల చేతి వృత్తుల్లో శిక్షణా కార్యక్రమాన్ని చేపట్టారు.

రాజ్ భవన్ మహిళలకు చేతి వృత్తుల్లో శిక్షణ

కుట్లు, అల్లికలు, ఎంబ్రాయిడరీ, జ్యూట్ బ్యాగుల తయారీ, పేపర్​తో కళాకృతుల తయారీపై శిక్షణ ఇవ్వనున్నారు. ఈ మేరకు రాజ్ భవన్ కమ్యునిటీ హాల్​లో ఏర్పాటు చేసిన సమావేశంలో గవర్నర్ పాల్గొని ... మహిళలు ఆర్థిక సాధికారత సాధించాలన్నదే తమ ప్రధాన లక్ష్యమన్నారు. ఎలీప్ వారి సహకారంతో నిర్వహించనున్న ఈ శిక్షణలో పాల్గొనే మహిళలు... తప్పక కొవిడ్ జాగ్రత్తలు పాటించాలని గవర్నర్ కోరారు.

ఇదీ చదవండి : టీఎస్​ బీపాస్​ అమలుకు త్వరలో కార్యాచరణ: కేటీఆర్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.