ప్రతిఒక్కరూ రక్తదానం చేసేందుకు ముందుకు రావాలని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ కోరారు. తాను తెలంగాణ గవర్నర్‌గా పదవి స్వీకరించే సమయానికి రాష్ట్రంలో డెంగీ విజృంభణ కొనసాగుతోందని... సరైన సమయంలో ప్లేట్లెట్స్ ఎక్కించడం వల్ల ప్రాణాలు కాపాడవచ్చన్నారు. వ్యాధిగ్రస్తుల రక్త సంబంధికులు రక్తదానం చేయడానికి నిరాకరిస్తున్న సందర్భంలో.. రక్తదానం చేస్తున్న వారిని చూస్తే గర్వంగా ఉంటుందని ఆమె అన్నారు.
జేఎన్టీయూహెచ్లో నిర్వహించిన ఈ కార్యక్రమంలో సుమారు 500 మంది రక్తదానం చేశారు. రక్తదాతలతో ముచ్చటించిన తమిళిసై వారందరిని అభినందించారు. కాన్సర్ అవగాహనపై వ్యాసరచన పోటీలను నిర్వహించారు. గెలుపొందిన వారికి గవర్నర్ చేతుల మీదుగా బహుమతులు ప్రదానం చేశారు.
కళాప్రదర్శనలలో అత్యాచారాలు, యాసిడ్ దాడులపై అవగాహన కల్పించడం అభినందనీయమన్నారు. పోషకాహారలోపంపై కూడా అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని గవర్నర్ అభిప్రాయపడ్డారు. కాన్సర్‌ను సరైన సమయంలో గుర్తిస్తే నివారించవచ్చునని తెలిపారు. దాడుల నుంచి రక్షణ కోసం మహిళలు ఆత్మరక్షణ విద్యలు నేర్చుకోవాలని సూచించారు.
ఇవీచూడండి: అత్యాచార కేసులపై రాష్ట్రాలను నివేదికలు కోరిన సుప్రీం