ETV Bharat / city

ESMA : సమ్మెదిశగా ఉద్యోగుల అడుగులు.. ఎస్మా ప్రయోగించేందుకు ఏపీ సర్కార్ సమాయత్తం

author img

By

Published : Jan 30, 2022, 6:41 AM IST

ESMA : ఉద్యోగులు సమ్మెబాట పడితే.. ఎస్మా ప్రయోగించే అంశంపై ఏపీ ప్రభుత్వం ఆలోచన చేస్తోంది. ఆర్టీసీ, విద్యుత్ లాంటి కీలక శాఖలు కూడా ఉద్యమంలోకి వెళ్తామని ప్రకటించడంతో..ప్రభుత్వం అప్రమత్తం అయ్యింది. అత్యవసర విధులు నిర్వహించాల్సిన శాఖల ఉద్యోగులు సమ్మెకు వెళ్తే ఇబ్బందులు తలెత్తే అవకాశమున్నందున ఎస్మా ప్రయోగించే అంశంపై కసరత్తు జరుగుతోంది. దీనికి సంబంధించిన ఉత్తర్వులు త్వరలోనే జారీ అయ్యే అవకాశాలున్నాయి.

ESMA
ESMA
ఎస్మా ప్రయోగించేందుకు ఏపీ సర్కార్ సమాయత్తం

ESMA : ఏపీలో ప్రభుత్వ ఉద్యోగులు సమ్మెదిశగా అడుగులు వేస్తుండటంతో.. ఎస్మా చట్టం ప్రయోగించేందుకు ఆ రాష్ట్ర ప్రభుత్వం సమాయత్తం అవుతోంది. ప్రత్యేకించి అత్యవసర సర్వీసులుగా పరిగణించే ఆర్టీసీ, విద్యుత్, వైద్యారోగ్యశాఖ ఉద్యోగులు.. ఇప్పటికే ప్రభుత్వానికి సమ్మె నోటీసు ఇవ్వటంతో ప్రభుత్వం అప్రమత్తమైంది. ప్రజలకు అందించే సేవల్లో అంతరాయం లేకుండా చూసేందుకు ఎస్మా చట్టం ప్రయోగించటం ఒక్కటే పరిష్కారమని.. ప్రభుత్వం భావిస్తోంది. ఓ వైపు చర్చల కోసం ప్రయత్నాలు చేస్తూనే దీనిపైనా కసరత్తు చేయాలని ప్రభుత్వం అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్టు సమాచారం. ఏయే శాఖల్లోని ఉద్యోగులపై ఎస్మా ప్రయోగించవచ్చనే అంశంపై శాఖల వారీగా జాబితాను సిద్దం చేస్తున్నారు.

సమ్మెకు వెళ్లటానికి నోటీసు అవసరం లేదు..

ESMA Implementation in AP : ప్రజా రవాణా ఉద్యోగ సంఘాలు.. తాము సమ్మెకు వెళ్లడానికి ఏపీ ఆర్టీసీ ఎండీకి ప్రత్యేక నోటీసు అవసరం లేదని సీఎస్‌కు పీఆర్సీ సాధన సమితి ఇచ్చిన నోటీసు చాలని చెబుతున్నాయి. వైద్య, విద్యుత్‌ శాఖ ఉద్యోగులు కూడా తమ ఉద్యమ కార్యాచరణను ప్రకటించారు. అయితే సాధారణ ప్రభుత్వ కార్యాకలాపాల్లో భాగంగా.. విద్యుత్ శాఖలో సమ్మెలను నిషేధిస్తూ ఇటీవలే ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ తరుణంలో విద్యుత్ ఉద్యోగులు సమ్మెకు దిగితే ఎస్మా ప్రయోగించేందుకు వెనుకాడకూడదని ప్రభుత్వం భావిస్తోంది.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోనిలో రిజిస్ట్రేషన్ ఉచితం!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.