ETV Bharat / city

అందుబాటులో వలస కూలీలు.. పనులకు పచ్చజెండా! - రహదారులు-భవనాలు, గృహనిర్మాణ శాఖ

వలస కూలీలు అందుబాటులో ఉన్న ప్రాంతాల్లో నిర్మాణ పనులు చేపట్టేందుకు రాష్ట్ర రహదారులు-భవనాలశాఖ సమాయత్తమవుతోంది. పలువురు గుత్తేదారులు సైతం ఆసక్తి చూపుతుండటంతో అనుమతి ఇవ్వాల్సిందిగా ఆ శాఖ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది. లాక్‌డౌన్‌ నేపథ్యంలో నిర్మాణ పనులు నిలిచిపోయిన విషయం విదితమే. వచ్చే సోమవారం నుంచి కొన్ని రంగాల్లో నిర్మాణ పనులు చేపట్టేందుకు వెసులుబాటు కల్పిస్తూ కేంద్రం బుధవారం మార్గదర్శకాలు జారీ చేసిన విషయం తెలిసిందే.

construction works
పనులకు పచ్చజెండా!
author img

By

Published : Apr 17, 2020, 10:24 AM IST

ప్రభుత్వ పథకాల పరిధిలోని పనులే చేపట్టాలని, వ్యక్తిగత దూరాన్ని విధిగా పాటించాలని కేంద్రం స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో వలస కూలీలు అందుబాటులో ఉన్న ప్రాంతాల్లో నిర్మాణ పనులు చేపట్టేందుకు రాష్ట్ర రహదారులు-భవనాలశాఖ సమాయత్తమవుతోంది. పనులు చేపట్టాలంటూ రహదారులు-భవనాలు, గృహనిర్మాణ శాఖలను మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. ఏయే మార్గాల్లో పనులు చేపట్టేందుకు అవకాశం ఉందో తెలుసుకునే పనిలో అధికారులున్నారు. లాక్‌డౌన్‌ అమలులో ఉన్నప్పటికీ గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ పరిధిలో రహదారులు, వంతెన నిర్మాణ పనులు ముమ్మరంగా సాగుతున్న అంశాన్నీ ప్రభుత్వం పరిశీలిస్తోంది.

రెండు పడకల ఇళ్లు...

పెద్ద సంఖ్యలో రెండు పడకల ఇళ్ల నిర్మాణం చేపట్టే ప్రాంతాల్లో కూలీల క్యాంపులున్నాయి. ఇక్కడ కూలీలు అందుబాటులో ఉండటంతో ఈ ఇళ్ల పనులు చేపట్టేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. కలెక్టరేట్ల నిర్మాణాలు, జాతీయ రహదారుల పనుల్లో కూడా ఇతర రాష్ట్రాల కూలీలు అధికంగా ఉండటంతో అధికారులు వాటిపైనా దృష్టి సారించారు.

యాదాద్రి పనులు..

యాదాద్రి ఆలయ విస్తరణ పనుల్లో కూడా వేగం పెంచనున్నారు. ఆదివారం రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో ప్రభుత్వం నుంచి అనుమతి లభిస్తుందని, త్వరలో పనులు చేపడతామని రహదారులు-భవనాల శాఖ ఉన్నతాధికారి ఒకరు చెప్పారు.

ఇదీ చదవండి: దండిగా ధాన్యం.. ఇక్కట్లు తీరిస్తే ధన్యం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.