మేడారం జాతరను ప్లాస్టిర్ రహితంగా నిర్వహించేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. జాతరకు వచ్చే భక్తులకు అవగాహన కల్పించేందుకు సర్కారు సాయంతో ఇన్నోవేటివ్ యాడ్స్ సంస్థ.. ప్లాస్టిర్ రహిత మేడారం జాతరపై లఘు చిత్రాల పోటీలను నిర్వహిస్తోంది. జౌత్సాహిక యువ దర్శకులు ఈ పోటీల్లో పాల్గొనేందుకు అవకాశం కల్పిస్తోంది.
మొదటి బహుమతి రూ.75 వేలు, రెండు, మూడు బహుమానాలకు రూ. 50 వేలు, రూ.25 వేలను ప్రోత్సాహకంగా ఇస్తున్నారు. హైదరాబాద్ ఫిల్మ్ ఛాంబర్లో గిరిజన సంక్షేమ శాఖ డిప్యూటి డైరెక్టర్ సత్యనారాయణ, సినీ దర్శకులు వీరశంకర్, శివనాగేశ్వరరావు లఘు చిత్ర పోటీల పోస్టర్ను ఆవిష్కరించారు.
ఇవీచూడండి: మేడారం జాతరను ప్లాస్టిక్ రహితం చేసేందుకు ప్రణాళిక