ETV Bharat / city

తెరాస, ఎంఐఎం ప్రజలను మోసం చేస్తున్నాయి: రాజాసింగ్‌

జీహెచ్‌ఎంసీ మేయర్‌ ఎన్నికలో తెరాస, మజ్లిస్‌ వ్యవహరించిన తీరును యావత్‌ తెలంగాణ ప్రజలు గమనించారని గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ అన్నారు. ఇద్ధరు దొంగలు కలిసి మేయర్‌ పీఠాన్ని కైవసం చేసుకున్నారని విమర్శించారు.

goshamahal mla raja singh
గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్
author img

By

Published : Feb 11, 2021, 2:05 PM IST

బల్దియా ఎన్నికల సమయంలో మజ్లిస్​తో సంబంధం లేదని ప్రకటించిన తెరాస నేతలు.. మేయర్ ఎన్నికలో ఆ పార్టీ మద్దతు ఎలా తీసుకున్నారని గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ నిలదీశారు. మేయర్ ఎన్నికలో తెరాస, మజ్లిస్ వ్యవహరించిన తీరును ప్రజలు గమనించారని తెలిపారు. రాష్ట్ర ప్రజలను ఈ రెండు పార్టీలు మోసం చేశాయని మండిపడ్డారు.

గతంలోనూ ఈ రెండు పార్టీలే జీహెచ్ఎంసీని నాశనం చేశారని రాజాసింగ్ ఆరోపించారు. మేయర్ ఎన్నికలో పోటీ చేస్తానని ప్రకటించిన మజ్లిస్.. తెరాసకు ఎందుకు మద్దతు తెలిపిందో చెప్పాలని డిమాండ్ చేశారు. తెరాస కార్పొరేటర్లు ఇలాంటి పార్టీలో ఉంటారా.. బయటకొస్తారో ఆలోచించుకోవాలని హితవు పలికారు. జీహెచ్​ఎంసీ ఎన్నికల్లో తెరాస, ఎంఐఎం కలిసి పోటీ చేస్తే తెరాసకు 15 సీట్లు కూడా వచ్చేవి కాదని అన్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.