శంషాబాద్ విమానాశ్రయంలో కోటి రూపాయలు విలువ చేసే రెండున్నర కిలోల బంగారాన్ని కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఉదయం జడ్డా నుంచి హైదరాబాద్ వచ్చిన నలుగురు మహిళలు అనుమానాస్పదంగా తిరుగుతుంటే.. కస్టమ్స్ అధికారులు వారిని అదుపులోకి తీసుకున్నారు.
మహిళలను తనిఖీ చేయగా... అండర్ గార్మెంట్స్‌లో ముక్కలు చేసిన బంగారు బిస్కెట్లు, గాజులు, గొలుసులు ఉన్నట్లు గుర్తించి.. స్వాధీనం చేసుకున్నారు. వారి వద్ద నుంచి బంగారాన్ని స్వాధీనం చేసుకుని... ఆ నలుగురిని అరెస్ట్ చేసినట్లు శంషాబాద్ విమానాశ్రయ కస్టమ్స్ డిప్యూటీ కమిషనర్ శివకృష్ణ తెలిపారు. బంగారం తరలించేందుకు వారిని స్మగ్లర్లు వాడుకున్నట్లు అనుమానిస్తున్నట్లు ఆయన తెలిపారు.