ఆజాదీ కా అమృత్ మహోత్సవ్‌లో భాగంగా నిర్వహిస్తున్న గ్లోబల్ జియోస్పేషియల్ సదస్సుకు భాగ్యనగరం వేదిక కానుంది. 2022 అక్టోబరులో జరిగే ఈ సదస్సును హైదరాబాద్‌లో నిర్వహించాలని కేంద్రం నిర్ణయించింది. ఇప్పటికే సదస్సుకు సంబంధించిన సన్నాహక సమావేశం జరిగినట్లు కేంద్ర ఐటీశాఖ తెలిపింది.
అగ్రరాజ్యాలకు చెందిన జియో స్పేషియల్ నిపుణులు ఈ సదస్సులో పాల్గొంటారని వెల్లడించింది. 2018లో చైనాలో తొలి గ్లోబల్ జియో స్పేషియల్ సదస్సు జరగగా.. రెండోసారి భారత్ ఆతిథ్యం ఇవ్వనుంది.
ఇదీ చూడండి: KTR: 'నాన్న నన్ను ఐఏఎస్ చేయాలనుకున్నారు... కానీ నేనేమి చేశానంటే..'