ETV Bharat / city

జీహెచ్ఎంసీలో నిరక్షరాస్యుల సర్వే - జీహెచ్‌ఎంసీ కమిషనర్‌

జీహెచ్ఎంసీ పరిధిలో నిరక్షరాస్యులను గుర్తించే సర్వే చేపట్టింది. ఫిబ్రవరి 24న మొదలైన ఈ సర్వే తొమ్మిది రోజులపాటు కొనసాగనుంది.

GHMC Started Illiterate Survey In Hyderabad

author img

By

Published : Feb 25, 2020, 12:33 PM IST

హైదరాబాద్​ నగరంలో ఉన్న నిరక్షరాస్యులను లెక్క తేల్చేందుకు జీహెచ్ఎంసీ సర్వే చేపట్టింది. గ్రేటర్ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌లో గల నిరక్షరాస్యులు ఎంతమందో ఈ సర్వేలో తేలనుంది. ఫిబ్రవరి 24 నుంచి మార్చి 4వరకు తొమ్మిది రోజుల పాటు జరిగే ఈ సర్వేలో తొలిరోజు లక్షా 23 వేల కుటుంబాలను ఎన్యుమరేట్‌ చేశారు. ఇందులో 17,365 మంది నిరక్షరాస్యులను గుర్తించినట్లు జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ డీఎస్‌ లోకేశ్​ ‌కుమార్‌ తెలిపారు.

నగరంలోని 150 వార్డులను 5,704 నాలుగు ఆవాస ప్రాంతాలుగా గుర్తించి.. సర్వేకు అనుకూలంగా ఉండేలా బ్లాకులుగా విభజించారు. నగరంలో నివసిస్తున్న 24 లక్షల 78 వేల కుటుంబాలను ఈ సర్వేలో భాగస్వామ్యం చేయనున్నారు. బ్లాకుకు ఒకరు చొప్పున 8681 మంది ఎన్యుమరేటర్లు ఈ సర్వేలో పాల్గొంటున్నారు. సర్వేలో జీహెచ్ఎంసీ సేకరించిన నిరక్షరాస్యుల వివరాలను రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించనుంది.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.