ETV Bharat / city

కొత్త పాలకవర్గం కొలువుదీరే వేళ... సర్వం సిద్ధం...

గ్రేటర్ హైదరాబాద్ మహానగర పాలక సంస్థ కొత్త పాలక వర్గం గురువారం కొలువుదీరనుంది. నూతనంగా ఎన్నికైన పాలకవర్గం మొదట ప్రమాణస్వీకారం చేయనుంది. అనంతరం జీహెచ్ఎంసీ మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికను అధికారులు నిర్వహించనున్నారు. దీనికి సంబంధించి జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తిచేసింది.

Ghmc Mayor Election Arrangements
Ghmc Mayor Election Arrangements
author img

By

Published : Feb 10, 2021, 9:37 PM IST

Updated : Feb 10, 2021, 9:47 PM IST

సుదీర్ఘ విరామానికి తెర పడనుంది. రెండు నెలల క్రితం ఎన్నికైన జీహెచ్ఎంసీ నూతన కార్పొరేటర్లు గురువారం ప్రమాణ స్వీకారం చేయనున్నారు. గ్రేటర్ హైదరాబాద్​లో మొత్తం 150 డివిజన్లకు సంబంధించి ఎన్నిక నిర్వహించి... డిసెంబర్​లో ఫలితాలు ప్రకటించారు. నూతనంగా ఎన్నికైన కార్పొరేటర్లు గెలిచినా ఇప్పటివరకు పదవి బాధ్యతలు స్వీకరించలేదు. గురువారంతో పాత పాలకవర్గం కాలం పూర్తవనుండగా... నూతన పాలకవర్గం కొలువుదీరనుంది. ఇందుకోసం జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలోని కౌన్సిల్ హాల్​లో అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తిచేశారు. నూతన కార్పొరేటర్లు... గురువారం ఉదయం 10 గంటల 30 నిమిషాలలోపు జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయానికి చేరుకోవాలని అధికారులు సూచించారు.

అభ్యర్థులు తమ గుర్తింపును నిర్ధరించుకొని సమావేశ మందిరానికి ఉదయం 11 గంటలలోపు పంపనున్నారు. ఉదయం 11 గంటలకు నూతన కార్పొరేటర్ల ప్రమాణ స్వీకార కార్యక్రమం ప్రారంభమవుతుంది. నూతనంగా గెలిచిన భాజపాకు చెందిన లింగోజిగూడ కార్పొరేటర్ ఆకుల రమేశ్​ గౌడ్ ఒకరు చనిపోవడం వల్ల మొత్తం 149 మంది కార్పొరేటర్లు ఒక్కొక్కరుగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ప్రమాణస్వీకార పత్రాన్ని తెలుగు, ఇంగ్లీష్, హిందీ, ఉర్దూ భాషలలో ఏదైనా ఎంచుకొని తమ ప్రమాణ స్వీకారం చేయనున్నారు.

మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికల పరిశీలకులుగా సందీప్ కుమార్ సుల్తానియా, హైదరాబాద్ జిల్లా కలెక్టర్ శ్వేతా మహంతి ఎన్నికల ప్రిసైడింగ్ అధికారిగా వ్యవహరించనున్నారు. హైదరాబాద్ సీపీ అంజనీకుమార్ ఆధ్వర్యంలో పటిష్ఠ బందోబస్తు మధ్య ఎన్నిక నిర్వహించనున్నారు. ప్రతీ సభ్యుడు తమ ఫొటో కలిగిన ఏదేని గుర్తింపు కార్డు తప్పనిసరిగా తీసుకురావాలని అధికారులు ఆదేశాలు జారీచేశారు. సమావేశం నిర్వహణను తెలియజేస్తూ... ఇప్పటికే జీహెచ్ఎంసీ పంపిన లేఖను, ఆర్వో ఇచ్చిన గెలుపు పత్రాన్ని కూడా సభ్యులు తీసుకురావాలని సూచించారు. కేవలం సభ్యులను మాత్రమే కౌన్సిల్​హాల్​లోకి అనుమతించనున్నారు.

కరోనా నేపథ్యంలో ప్రతీ సభ్యుడు తప్పని సరిగా కొవిడ్​ నిబంధనలు పాటిస్తూ మాస్కులను ధరించాలని సూచించారు. కౌన్సిల్ హాల్​లో పార్టీల ప్రాతిపదికగా సభ్యులకు తమ వార్డుల పేర్లను తెలియచేస్తూ... అక్షర క్రమంలో సీట్లు కేటాయించారు. ప్రతీ వరుసలో సహాయకారిగా ఉండేందుకు రో- అధికారుల నియామకం చేశారు. ప్రతి సభ్యుడు ఏ సీటులో కూర్చోవాలో ఈ 30 మంది అధికారులు తెలియజేస్తారు.

ప్రమాణ స్వీకారం అనంతరం 12.30 నిమిషాలకు మొదటగా మేయర్, తర్వాత డిప్యూటీ మేయర్ ఎన్నిక ఉంటుంది. ఈ ఎన్నికను ప్రెసైడింగ్ అధికారిణి శ్వేతమహంతి సభ్యులతో చేతులు ఎత్తడం ద్వారా మేయర్, డిప్యూటీ మేయర్ నిర్వహిస్తారు. ఎన్నికల ప్రక్రియను మొత్తం వీడియో రికార్డు చేయనున్నారు. జీహెచ్ఎంసీలో మొత్తం 149 నూతన కార్పొరేటర్లతో పాటు... ఎక్స్ అఫిసియో సభ్యులు 44 మంది ఉన్నారు. మొత్తం 193 మంది సభ్యుల్లో 97 మంది సభ్యులు హాజరై... కోరం ఉంటే మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నిక నిర్వహిస్తారు. లేకుంటే మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నిక శుక్రవారానికి వాయిదా వేస్తారు. ఆ రోజు కూడా ఎన్నికలు జరగకుంటే... ఎస్ఈసీ మరో తేదీని ప్రకటించనుంది. తెరాస నుంచి 56 కార్పొరేటర్లు, 32 ఎక్స్ అఫిషియో సభ్యులు ఉన్నారు. భాజపా నుంచి 47 కార్పొరేటర్లు, 2 ఎక్స్ అఫిషియో సభ్యులు ఉన్నారు. ఎంఐఎం నుంచి 44 కార్పొరేటర్లు, 10 మంది ఎక్స్ అఫిషియో సభ్యులున్నారు. కాంగ్రెస్ నుంచి ఇద్దరు కార్పొరేటర్లు ఉన్నారు.

ఏ పార్టీకి మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికకు కావాల్సిన స్పష్టమైన మెజార్టీ లేకపోవడం వల్ల ఏమవనుందనే ఉత్కంఠ నెలకొంది. ఇటూ తెరాసకు దీటుగా తాము మేయర్, డిప్యూటీ మేయర్ అభ్యర్థులను దింపుతున్నట్లు భాజపా వర్గాలు తెలిపాయి.

ఇదీ చూడండి: మేయర్​ అభ్యర్థిత్వంపై తెరాసలో ఎడతెగని ఉత్కంఠ

Last Updated : Feb 10, 2021, 9:47 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.