హైదరాబాద్లో మరో రెండు, మూడు రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున యంత్రాంగం అప్రమత్తమైంది. జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలోని ఫ్లడ్కంట్రోల్ రూమ్లో మేయర్ బొంతు రామ్మోహన్, డిప్యూటీ మేయర్బాబా ఫసియుద్ధీన్ వర్షాల పరిస్థితులపై సంబంధిత అధికారులతో చర్చించారు. మాన్సూన్ ఎమర్జెన్సీ, డీఆర్ఎఫ్ బృందాలను అప్రమత్తం చేశారు. లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలను శిబిరాలకు తరలించినట్లు మేయర్ బొంతు రామ్మోహన్ తెలిపారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని... అవసరమైతే అధికారులను సంప్రదించాలని సూచించారు.
ఇవీచూడండి: వరద బాధితులకు ప్రభుత్వం అండ.. రూ.550 కోట్లు విడుదల