ఈ నెల 24న తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ జన్మదినం సందర్భంగా పార్టీ శ్రేణులు 'గిఫ్ట్ ఏ స్మైల్' పేరుతో వినూత్న కార్యక్రమాలు చేపట్టాలని జీహెచ్ఎంసీ మేయర్ బొంతు రామ్మోహన్ పిలుపునిచ్చారు. బొకేలు, శాలువాలు, హోర్డింగుల కోసం ఖర్చు చేయకుండా... ఆపదలో ఉన్న వారికి సాయం చేసి వారి చిరునవ్వులు కేటీఆర్కు కానుకగా ఇవ్వాలన్నారు. వస్తు, ధన రూపాల్లో కానీ.. ఏదైనా ఇతర రూపాల్లో వ్యక్తిగత, సామాజిక అవసరాలను తీర్చి... ఫోటోలు, వివరాలు కేటీఆర్ ట్విట్టర్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రాం, ఇతర సామాజిక మాధ్యమాల్లా ట్యాగ్ చేయాలని పిలుపునిచ్చారు. కేటీఆర్ జన్మదిన వేడుకలను అత్యంత ఘనంగా నిర్వహించాలని తెరాస శ్రేణుల్లో ఉత్సాహం ఉన్నప్పటికీ... కరోనా పరిస్థితుల కారణంగా నిరాడంబరంగా జరపాలని నిర్ణయించినట్టు తెలిపారు.
ఇదీ చూడండి: కరోనా విషయంలో హైకోర్టు ఏదడిగినా ఇవ్వండి: కేసీఆర్