గ్రేటర్లో డిసెంబర్ 1న జరగనున్న ఎన్నికల్లో ఓటరు గుర్తింపు కార్డుకు ప్రత్యామ్నాయంగా మరో 18 గుర్తింపు కార్డుల్లో ఏదో ఒకటి చూపినా ఓటు వేసేందుకు అనుమతిస్తామని ఎన్నికల అధికారి లోకేష్‌కుమార్ వెల్లడించారు. ఓటు వేసేందుకు ముందు పోలింగ్ కేంద్రాల్లో ఓటర్ల గుర్తింపు నిర్ధరణకు వాటిని చూపాల్సి ఉంటుందన్నారు. ఏదైనా ఒకటి ఉన్నా ఓటు వేసేందుకు అనుమతి ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు.
ఇందులో
1.ఆధార్ కార్డు
2.పాస్‌పోర్ట్
3.డ్రైవింగ్ లైసెన్స్
4.ఫొటోతో కూడిన సర్వీస్ ఐడెంటిటి కార్డ్
5. ఫొటోతో కూడిన బ్యాంకు పాస్‌బుక్
6. పాన్ కార్డు
7.ఆర్‌జిఐ స్మార్ట్ కార్డు
8. ఎన్‌పీఆర్ స్మార్ట్ కార్డు
9. జాబ్ కార్డు
10. హెల్త్ కార్డు
11.ఫొటోతో కూడిన పింఛను డాక్యుమెంట్
12 ఎమ్మెల్యే, ఎంపీ, ఎమ్మెల్సీలకు జారీచేసిన అధికార గుర్తింపు పత్రం
13.రేషన్ కార్డు,
14.కుల ధృవీకరణ పత్రం
15. ఫ్రీడమ్ ఫైటర్ ఐడెంటిటి కార్డు
16. ఆర్మ్స్ సెన్స్ కార్డు, అంగవైకల్యం సర్టిఫికేట్
17 లోక్‌సభ, రాజ్యసభ మెంబర్ ఐడెంటిటి కార్డు
18 పట్టాదారు పాస్‌బుక్
ఇవీ చూడండి: ఆ టైమ్ దాటితే రెండేళ్ల జైలు, జరిమానా