రాష్ట్రంలో తెలంగాణ స్టేట్ బిల్డింగ్ పర్మిట్, సెల్ఫ్ సర్టిఫికేషన్ సిస్టమ్ (టీఎస్ బీపాస్) అనే నూతన విధానాన్ని ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చింది. జీహెచ్ఎంసీతోపాటు రాష్ట్రంలోని పట్టణాలు, నగరాల్లో భవన నిర్మాణాలు, లే అవుట్ల అనుమతులకు దరఖాస్తు చేసిన నిర్ణిత సమయంలోగా ఆన్లైన్లో అనుమతులు జారీ చేయనున్నారు. ప్రజలపై విశ్వాసంతో తీసుకోచ్చిన టీఎస్ బీపాస్‌ను వినియోగించుకోవాలని పురపాలక శాఖ అధికారులు కోరుతున్నారు. తప్పుడు వివరాలతో భవనాలు నిర్మిస్తే... ఎలాంటి నోటీసు లేకుండానే కూల్చే అధికారాన్ని సైతం ఈ చట్టంలో ప్రవేశపెట్టారు. టీఎస్ బీపాస్ ద్వారా ఆన్ లైన్లో భవన నిర్మాణాలు, లే అవుట్ల పర్మిషన్‌కు ఎలా అప్లయ్ చేసుకోవాలనే విషయాలను జీహెచ్ఎంసీ చీఫ్ సిటీ టౌన్ ప్లానింగ్ అధికారి దేవేందర్ రెడ్డితో మా ప్రతినిధి కార్తీక్ ముఖాముఖి.
ఇదీ చూడండి: పోటీ చేసే అభ్యర్థులు పారదర్శకత పాటించాలి: పార్థసారథి