ETV Bharat / city

పోలింగ్ శాతం పెంచేలా బల్దియా చర్యలు.. ఐటీలపై ప్రత్యేక దృష్టి

భాగ్యనగరంలో ఎన్నికల ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేసేందుకు యంత్రాంగం చర్యలు చేపడుతోంది. ప్రధాన ఘట్టమైన పోలింగ్‌ రోజున ఓటింగ్‌ శాతాన్ని పెంచేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం, జీహెచ్‌ఎంసీ అధికారులు కసరత్తు చేస్తున్నారు.

ghmc measures to increase polling percentage
పోలింగ్ శాతం పెంచేలా బల్దియా చర్యలు
author img

By

Published : Nov 21, 2020, 7:16 AM IST

గ్రేటర్ ఎన్నికలపై అధికార యంత్రాంగం కసరత్తు ముమ్మరం చేసింది. ఈసారి పోలింగ్ శాతం పెంచేందుకు చర్యలు చేపడుతోంది. ఎన్నికల కమిషనర్‌ ఇప్పటికే స్వచ్ఛంద సంస్థలకు ఓటరు చైతన్యంపై వివరించగా.. మరో దఫా ఎన్జీవోలు, యువతతో సమావేశం కానున్నారు. ఇదివరకు కొందరికే పరిమితమైన పోస్టల్‌ బ్యాలెట్‌ను ఈ సారి దివ్యాంగులు, 80ఏళ్ల వయసు దాటిన వారూ వినియోగించుకునే వీలు కల్పించింది.

2016 జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో 10 డివిజన్లలో 20 శాతం లోపు, 18 డివిజన్లలో 21- 30శాతం మధ్య, 62 డివిజన్లలో 31-40 మధ్య, 47 డివిజన్లలో 41-50 మధ్య మాత్రమే పోలింగ్‌ శాతం నమోదైంది. అత్యల్పంగా.. సూరారంలో 16.44, రెయిన్‌బజార్‌ 15.61, తలాబ్‌చంచలం 14.78, మూసారాంబాగ్‌ 13.24, ఆజంపురాలో 10.60శాతం పోలింగ్‌ నమోదు అయిందంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్ఛు నగరంలో 74లక్షల ఓటర్లు ఉన్నారు. వీరిలో 20-29 వయసు గల వారు 15 లక్షల పైచిలుకే. వీరందరినీ పోలింగ్‌ కేంద్రాలకు రప్పించేందుకు కార్యక్రమాలు చేపట్టనున్నారు.

ఐటీపై ప్రత్యేక గురి

భాగ్యనగరం కేంద్రంగా 6లక్షల మంది ఐటీ ఉద్యోగులు పనిచేస్తున్నారు. వీరిలో 30-35శాతం మందికి ఓటుహక్కు ఉంది. ప్రతి ఎన్నికల్లో 10శాతం మంది కూడా ఓటింగ్‌కు రావడం లేదు. సెలవు లేకపోవడం, విదేశీ సంస్థల్లో పనులు చేసేవారికి విరామం లేకపోవడం తదితర కారణాలున్నాయి. ఈ ఏడాది వర్క్‌ ఫ్రం హోమ్‌తో అంతా ఇళ్లకే పరిమితమవడంతో వారంతా ముందుకొచ్చేలా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.

ఆన్‌లైన్‌ వేదికగా హ్యాకథాన్లు

ఐటీ ఉద్యోగులకు ఓటు హక్కుపై చైతన్యం కల్పిస్తూ ఆన్‌లైన్‌లో హ్యాకథాన్లు నిర్వహించనున్నాం. టీటా తరఫున ఓటింగ్‌ పెంచేందుకు కృషి చేస్తున్నాం.

- సందీప్‌ మక్తల, టీటా గ్లోబల్‌ ప్రెసిడెంట్‌

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.