ETV Bharat / city

భారత్‌ బయోటెక్‌ సంస్థకు 'ఎక్స్‌లెన్స్‌ అవార్డ్' - భారత్‌ బయోటెక్‌ వార్తలు

భారత్‌ బయోటెక్‌ సంస్థకు మరో అరుదైన గౌరవం దక్కింది. జినోమ్‌ వ్యాలీ ప్రతిభా పురస్కారానికి భారత్ బయోటెక్ ఎంపికైంది. ఈనెల 22, 23 తేదీల్లో జరిగే బయో ఆసియా అంతర్జాతీయ సదస్సులో 'ఎక్స్‌లెన్స్‌ అవార్డు'ను ప్రదానం చేయనున్నారు.

భారత్‌ బయోటెక్‌ సంస్థకు 'ఎక్స్‌లెన్స్‌ అవార్డ్'

author img

By

Published : Feb 13, 2021, 7:55 AM IST

హైదరాబాద్​ నగరంలో ఈనెల 22, 23 తేదీల్లో దృశ్యమాధ్యమంలో జరిగే 'బయో ఆసియా అంతర్జాతీయ సదస్సు' సందర్భంగా.. ఏటా ఇచ్చే జినోమ్‌ వ్యాలీ ప్రతిభా పురస్కారానికి భారత్‌ బయోటెక్‌ సంస్థకు ఎంపిక చేశారు. తొలి రోజు మంత్రి కేటీఆర్ భారత్‌ బయోటెక్‌ సీఎండీ కృష్ణ ఎల్ల, జేఎండీ సుచిత్ర ఎల్లకు దీనిని అందజేస్తారు. ఈ సదస్సులో మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్లతో పాటు పలువురు ప్రముఖులు పాల్గొననున్నారు.

రెండో రోజు ఆరోగ్య పరిరక్షణపై చర్చాగోష్ఠిలో మంత్రి కేటీఆర్​తో జరిగే ముఖాముఖిలో సత్య నాదెళ్ల మాట్లాడతారు. జీవశాస్త్రాలు, ఆరోగ్య పరిరక్షణ రంగంలో సాంకేతికత పాత్రపై చర్చిస్తారు.

ఇవీ చూడండి: నేటి నుంచి ఆరోగ్య సిబ్బందికి రెండో డోసు వ్యాక్సినేషన్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.