ఆంధ్రప్రదేశ్లోని విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణను నిరసిస్తూ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు రాజీనామా చేశారు. సొంత దస్తూరితో రాసిన లేఖను గతంలో స్పీకర్ తమ్మినేని సీతారాంకు అందజేశారు.
ఈరోజు వైజాగ్ జర్నలిస్టు ఫోరం కార్యవర్గం ద్వారా ఎమ్మెల్యేగా తన రాజీనామా లేఖ ప్రతుల్ని అసెంబ్లీ కార్యదర్శి పి.బాలకృష్ణమాచార్యులకు గంటా శ్రీనివాసరావు అందించారు. తన రాజీనామా ఆమోదానికి సంబంధించి తగిన నిర్ణయం తీసుకోవాలని గంటా లేఖలో కోరారు. లేఖను తాను స్పీకర్ ఫార్మాట్లోనే పంపించానని.. అసెంబ్లీ కార్యదర్శికి ఫోన్ ద్వారా వివరించారు.
ఇదీ చదవండి: రాష్ట్ర ప్రగతిని వివరిస్తూ నివేదికలు రూపొందించాలి: సీఎస్