మహిళా మత్ససహకార సంఘం అధ్యక్షురాలు మామిడి శోభ బెస్త, మహిళా గంగపుత్ర సంఘం అధ్యక్షురాలు విద్య బెస్త ఆధ్వర్యంలో.. హైదరాబాద్ కార్వాన్ నియోజకవర్గంలో మహిళలు తెప్పను ఊరేగించి నదిలో వదిలారు. అనంతరం మహిళలు నదికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. వర్షాలు సకాలంలో కురిసి ప్రజలందరూ సుఖ శాంతులతో వర్థిల్లాలని.. తమ కుల దైవం గంగమ్మను కోరుకున్నట్లు శోభ తెలిపారు. కరోనా భారి నుంచి రక్షించమని.. అధిక వర్షాలు, వరదలతో ప్రజలకు ఎలాంటి ఆపద రానీయకుండా కాపాడమని మొక్కులు చెల్లించినట్లు విద్య వివరించారు.
తెలంగాణలో కరవు రాకుండా ప్రజలందర్నీ కాపాడమని తమ కుల దైవం గంగమ్మను ఊరేగిస్తూ ఏటా గంగ తెప్పోత్సవం నిర్వహిస్తామని సబ్జీమండి మత్స్యసహకార సంఘం, గంగపుత్ర సంఘం నేతలు కట్ట లింగం బెస్త, గూడమోని అశోక్ కమార్ బెస్త స్పష్టం చేశారు. ప్రకృతి వైపరిత్యంలో ప్రాణ నష్టం లేకుండా ప్రజలను చల్లగా చూడాలని మొక్కులు సమర్పించామన్నారు. కార్యక్రమంలో రాజ్యలక్ష్మి బెస్త, గుంటి రుక్మిణి బెస్త, క్రాంతి కుమార్ గంగపుత్ర తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చూడండి: 20 లక్షలు దాటిన ఎల్‌ఆర్‌ఎస్ దరఖాస్తులు